నేడు నూతన పార్లమెంట్‌ ‌భవనం ఆవిష్కృతం

  • ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • విపక్షాల బహిష్కరణ పిలుపులో అర్థంలేదన్న కమలహాసన్‌
  • ఎవరు ప్రారంభిస్తారన్నది సమస్య కాదన్న గులాంనబీ ఆజాద్‌
  • ‌రాష్ట్రపతి ముర్ముపై వ్యాఖ్యలు..కేజ్రీవాల్‌, ‌ఖర్గేలపై కేసు

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే27: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం నేడు అట్టహాసంగా జరుగనుంది.  నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు  ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో భాగంగా లోక్‌సభ సభాపతి ఆసనం వద్ద రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. కాంగ్రెస్‌ ‌సహా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తుండగా, తెదేపా, వైకాపా, ఎస్‌ఏడీ, బీజేడీ వంటి ఎన్డీయేయేతర పార్టీలు హాజరవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం తగదని నటుడు కమలహాసన్‌ ‌విపక్షాలను కోరారు. ఇది జాతీయ ఆనందానికి ప్రతీకగా గుర్తించాలన్నారు. తక్కువ సమయంలో పార్లమెంటు భవనాన్ని సిద్ధం చేయడం తేలికైన విషయం కాదని మాజీమంత్రి గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఈ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారా? రాష్ట్రపతి ప్రారంభించారా? అనేది ముఖ్యమైన విషయం కాదన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ ఎన్నుకోలేదని కాదని, ప్రతిపక్షాలు ద్రౌపది ముర్ముకు అంత అనుకూలం అయితే, ఆమెకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టారని ప్రశ్నించారు.  ఇకపోతే ఈ వివాదంలో దిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , ఇతర నేతలపై ఫిర్యాదు నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కులాన్ని ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వీరిపై ఈ ఫిర్యాదు నమోదైంది. వీరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ కమ్యూనిటీల మధ్య శత్రుత్వాన్ని పెంపెందించేందుకు, భారత ప్రభుత్వంపై అపనమ్మకాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో ఆరోపిం చారు. దీంతో ఐపీసీ సెక్షన్‌ 121,153ం, 505,34 ‌కింద వీరిపై ఫిర్యాదు నమోదైంది. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించ కపోవడంపై బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఇతర విపక్షాలు లక్ష్యంగాచేసుకున్నాయి.

 కాంగ్రెస్‌, ఆప్‌, ‌తృణమూల్‌ ‌సహా 20కి పైగా పార్టీలు తాము కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంలో పాల్గొనడం లేదని ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశాయి. మరోవైపు నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్షాలకు ప్రముఖ నటుడు, మక్కల్‌ ‌నీధి మయ్యమ్‌  ‌పార్టీ చీఫ్‌ ‌కమల్‌ ‌హాసన్‌ ఓ ‌సలహా ఇచ్చారు. రాజకీయ విభేదాలకు ఓ రోజు విరామం ప్రకటించాలని, ఈ కార్యక్రమాలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించి, జాతీయ ఐకమత్య సంబరంగా దీనిని మార్చాలని కోరారు. అదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రశ్నను సంధించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాలకు రాష్ట్రపతి ఎందుకు హాజరు కాకూడదో చెప్పాలని నిలదీశారు. అలాగే నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం దేశానికి గర్వకారణమని తెలిపారు. అయితే ఇది రాజకీయంగా విభజనకు దారితీసిందని పేర్కొన్నారు. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు హాజరుకాకూడదో దేశానికి చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.
దేశానికి అధిపతి అయిన రాష్ట్రపతి ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామి కాకపోవడానికి ఎటువంటి కారణం తనకు కనిపించడం లేదన్నారు. జమ్మూ-కశ్మీరుకు చెందిన డెమొక్రాటిక్‌ ‌ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ ‌పార్టీ చీఫ్‌ ‌గులాం నబీ ఆజాద్‌ ‌శనివారం మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో దేశ జనాభా దాదాపు ఐదు రెట్లు పెరిగిందని, పార్లమెంటేరియన్ల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో నూతన పార్లమెంటు భవనం అవసరం చాలా ఉందన్నారు. ఈ భవనాన్ని నిర్మించడం చాలా అవసరమని, తప్పనిసరి అని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో పార్లమెంటు భవనాన్ని సిద్ధం చేయడం తేలికైన విషయం కాదన్నారు. ఈ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారా? రాష్ట్రపతి ప్రారంభించారా? అనేది ముఖ్యమైన విషయం కాదన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ ఎన్నుకోలేదని కాదని, ప్రతిపక్షాలు ద్రౌపది ముర్ముకు అంత అనుకూలం అయితే, ఆమెకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టారని ప్రశ్నించారు. సుమారు 30 నుంచి 35 ఏళ్ల క్రితం తాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసినపుడు కొత్త పార్లమెంటు భవన నిర్మాణం గురించి కలలు కనేవారమని చెప్పారు. అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు, కేంద్ర మంత్రి శివరాజ్‌ ‌పాటిల్‌, ‌తాను దీని గురించి చర్చించామని చెప్పారు. దీని కోసం ఓ మ్యాపును కూడా తయారు చేశామన్నారు. అప్పట్లో తాము దీనిని నిర్మించలేకపోయామని చెప్పారు. అయితే ఇప్పుడు దీనిని నిర్మించడం చాలా మంచి విషయమని తెలిపారు.
మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలి
లోక్‌సభ స్పీకర్‌కు పిసిఐ లేఖ

నూతన పార్లమెంట్‌ ‌భవనం ప్రారంభోత్సవానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా డియాను అనుమతించాలని ప్రెస్‌ ‌క్లబ్‌ ఆఫ్‌ ఇం‌డియా పిసిఐ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లాకు పిసిఐ లేఖ రాసింది. ఎలాంటి షరతులు లేకుండా లోక్‌సభ ప్రెస్‌ ‌గ్యాలరీలోకి డియా ప్రవేశాన్ని అనుమతించాలని కోరింది. శాశ్వత ప్రెస్‌ ‌గ్యాలరీ పాస్‌లు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను గ్యాలరీలోకి అనుమతించని విషయాన్ని లేఖలో పిసిఐ గుర్తు చేసింది. కోవిడ్‌-19 ‌మహమ్మారి నేపథ్యంలో 2020 బడ్జెట్‌ ‌సెషన్‌లో డియా ప్రతినిధులపై ఆంక్షలు అమలు చేశారని, తరువాత కాలంలో కోవిడ్‌ ఆం‌క్షలను ఎత్తివేసినా.. జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలను సడలించలేదని లేఖలో పిసిఐ తెలిపింది. జర్నలిస్టులపై ఆంక్షలకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన కారణాలు చెప్పడం లేదని, కాబట్టి ఇలాంటి ఆంక్షలు డియాను నియంత్రించడానికి, స్వతంత్ర వార్తా కథనాల స్వేచ్ఛా ప్రవాహానికి ఆటంకం కలిగించడానికి, పత్రికా స్వేచ్ఛను పరిమితం చేయడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న ఎజెండాలో భాగంగా విశ్వసించాల్సి వస్తోందని పిసిఐ లేఖలో విమర్శించింది. అలాగే రద్దు చేసిన లోక్‌సభ ప్రెస్‌ అడ్వైజరీ కమిటీని తక్షణమే పునరుద్ధరించాలని పిసిఐ డిమాండ్‌ ‌చేసింది.
Breaking News NowNews parliaments Bhavan Inauguration liveprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment