పిల్లలలో వైరస్‌ ‌వేరియంట్లపై అధ్యయనం..

కర్ణాటక ఆరోగ్య విభాగం ప్రొఫెసర్‌ ‌రవి నాయకత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కమిటీ
‘‘‌నాకున్న అతి పెద్ద భయం ఏమిటంటే మూడవ వేవ్‌ ‌లో కొరోనా వైరస్‌ ‌పిల్లలను ప్రభావితం చేస్తుంది. నా ఈ అవగాహనా సాధారణ ఇంగితజ్ఞానం. మనం వృద్ధులకు రోగనిరోధక శక్తిని ఇస్తున్నాము. మధ్య వయస్కులైనవారికి రోగనిరోధక శక్తిని ఇస్తున్నాం.ఇప్పుడు యువతకు రోగనిరోధక శక్తి అందించటం ప్రారంభమైంది. కాని పిల్లలకు ఇంకా వ్యాక్సిన్‌ ‌లేదు. వైరస్‌ ఎల్లప్పుడూ అవకాశం ఉన్న హోస్ట్ ‌కోసం పొంచి ఉంటుంది.. అనుకూల శరీరం కనుగొంటుంది.ఇది మనకు చరిత్ర నేర్పింది ’’అని కర్ణాటక ప్రొఫెసర్‌ ‌వి. రవి ఇటీవల ఒక ప్రసంగంలో అన్నారు. దీని తరవాత రవి పిల్లలని కొరోనా నుంచి రక్షించే పనిలో పడ్డారు. కర్ణాటకలో కోవిడ్‌ ‌సోకిన పిల్లలలో కొరోనా వైరస్‌ ‌వేరియంట్లను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. రెండవ వేవ్‌ ‌లో పిల్లలకు సోకిన వైరస్‌ ‌జన్యు శ్రేణులను అధ్యయనం చేయడం ద్వారా వైరస్‌ ‌కొత్త వేరియంట్లు పిల్లలను ఏమేరకు ప్రభావితం చేస్తున్నాయి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ అధ్యయనం ద్వారా పిల్లలో కొరోనా వ్యాప్తిని అరికట్టే పని కర్ణాటక శాస్త్రవేత్తలు చేపట్టారు.

కోవిడ్‌ -19 ‌సంక్షోభంపై కర్ణాటక ప్రభుత్వానికి సలహా ఇచ్చే రాష్ట్ర సాంకేతిక సలహా కమిటీని నియమించటం జరిగింది. వైరస్‌ ‌జన్యు శ్రేణిని కనుగొనటం కోసం నోడల్‌ అధికారిని నియమించింది. కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌వచ్చిన పిల్లల నమూనాలలో వైరస్‌ ‌జన్యు శ్రేణులను అధ్యయనం చేయడానికి వైరాలజీ మాజీ ప్రొఫెసర్‌ ‌వి. రవిని కర్ణాటక ప్రభుత్వం నియమించింది. ‘‘ఇప్పుడు నమూనాలను సేకరిస్తున్నాం అటుపై వీటిని ప్రాసెస్‌ ‌చేయాలి. మేము సుమారు 15 రోజుల్లో డేటా మరియు సమాచారాన్ని సేకరించాలి అనుకుంటున్నాం’’అని ప్రొఫెసర్‌ ‌వి రవి తెలిపారు.

‘‘పిల్లలలో కొరోనా వ్యాప్తి సమస్య గురించి మేము చర్చించాము. పిల్లల నమూనాల నుండి వైరస్ల జన్యు శ్రేణిని అధ్యయనం చేయడానికి ఇంకొంత పని చేయాల్సిన అవసరం వుంది’’ అని ప్రజారోగ్య నిపుణుడు, రాష్ట్ర సాంకేతిక సలహా కమిటీ చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ఎం ‌కె సుదర్శన్‌ అన్నారు. రెండవ వేవ్‌ ‌లో పిల్లలకు సోకిన వైరస్‌ ‌జన్యు శ్రేణులను అధ్యయనం చేసి వైరస్‌ ‌కొత్త వేరియంట్స్ ‌పిల్లలను ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవడం ద్వారా మూడవ వేవ్‌ ‌లో కరోనా వైరస్‌ ‌సంక్రమణను అరికట్టేందుకు ప్రయత్నిస్తాం అని ఆయన తెలిపారు. కొరోనా పాజిటివ్‌ ‌వచ్చిన పిల్లల నమూనాల నుండి మరీ ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల సమూహాలలో తీవ్రంగా కరోనా సంక్రమణకి గురైన పిల్లల నమూనాల నుండి స్థానిక ఇన్ఫెక్షన్‌ ‌క్లస్టర్లు మరియు టీకాలు వేసిన వారిలో వచ్చిన కొరోనా వైరస్‌ ‌నమూనాల నుండి కూడా వైరస్‌ ‌జన్యు శ్రేణుల అధ్యయనాన్ని కర్ణాటక పరిశోధకులు చేపట్టారు. ‘‘వైరస్‌ ‌నిరంతరం పరివర్తన చెందుతోంది. వైరస్‌ ‌లు కూడా మనుగడ సూత్రాన్ని అనుసరిస్తాయి. అందుకే అవి పరివర్తన చెందుతాయి.

జనాభాలో రోగనిరోధక ఎస్కేప్‌ ‌వేరియంట్‌ ‌మనుగడ సాగించటానికి ప్రయత్నం చేస్తుంది.. దాన్ని పట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నాం అని’’ ప్రొఫెసర్‌ ‌రవి చెప్పారు. కర్ణాటకలో మొదటి మరియు రెండవ వేవ్‌ ‌లలో కొరోనా పాజిటివ్‌ ‌వచ్చిన వారిలో 10 శాతం మంది 0-19 వయస్సులో పిల్లలు మరియు యువకులు ఉన్నారు. ఈ సమూహంలో మరణాల రేటు 0.1 శాతంగా ఉంటుంది. అటుపై 0-9 వయస్సు వారిలో మరణాల 4 శాతానికి పెరిగింది 10-19 వయసు యువకులలో 6 శాతం మరణాల పెరుగుదల నమోదు అయ్యింది.

దీనితో కర్ణాటక ప్రభుత్వం జూన్‌ 7 ‌న, కోవిడ్‌-ఎల్‌ 19 ‌సమర్థవంతమైన నియంత్రణ మరియు నివారణ చర్యలను అభివృద్ధి కోసం కర్ణాటక ఆరోగ్య విభాగం ప్రొఫెసర్‌ ‌రవి నాయకత్వంలో ఎనిమిది మంది సభ్యులతో జన్యు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేటాయించిన ముఖ్య పనులలో ‘‘వైరస్‌ ‌వేరియంట్స్ అధ్యయనం చేసి కోవిడ్‌ -19 ‌జన్యు శ్రేణిని కనుక్కోవటం, రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే వైరస్‌ ‌వేరియంట్‌ ‌ను పట్టుకుని దాని వ్యాప్తిని గుర్తించడం మరియు జన్యు పర్యవేక్షణ..కావలసిన టీకా గురించి లోతైన విశ్లేషణ చేయడం.

eight members headedKarnataka Department of HealthProfessor Ravi
Comments (0)
Add Comment