‘‌ప్రజాతంత్ర’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

మరిపెడ : ప్రజాతంత్ర దినపత్రిక రూపొందించిన 2020 క్యాలెండర్‌ ‌సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలోని నవీన్‌ ‌రావు అతిథిగృహంలో మహబూబాబాద్‌ ‌జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌గుడిపూడి నవీన్‌ ‌రావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ గత 20 సంవత్సరాలుగా పత్రికా ప్రజల మనసులను దోచుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేదల పక్షపాతి అని అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు.

తాగునీరు సాగునీటి కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో విద్యుత్‌ ‌కొరత లేకుండా చేశారని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు గందసిరి రవి,మరిపెడ మండల అధ్యక్షులు అక్తర్‌ ‌పాషా, పులుసు సతీష్‌, ‌మచ్చ రాజేష్‌, ‌మహేందర్‌ ‌రెడ్డి, గుగులోత్‌ ‌వెంకన్న,అంబరీషా, సయ్యద్‌ ‌లతీఫ్‌, ‌రవీందర్‌ ‌నాయక్‌, ‌యాకూబ్‌ ‌జాని, కిషన్‌, ‌శ్రీపాల్‌ ‌రెడ్డి, పానుగోతు వస్రం నాయక్‌పాల్గొన్నారు.

Tags: The invention,free digital calendar,prajatantra,gundipudi naveen rao

free digital calendargundipudi navin rao.PrajatantraThe invention
Comments (0)
Add Comment