తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న బిజెపి బలం

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రను తెలంగాణ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు కాబట్టే తెలంగాణ ప్రజల నుండి ఈ ప్రజా సంగ్రామ యాత్రకు విశేషమైన స్పందన లభిస్తుంది. ఇప్పటికే రెండు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర పూర్తి కాగా అతి త్వరలో మూడవ దశ ప్రజా సంగ్రామ యాత్ర కూడా ప్రారంభమైతది. బండి సంజయ్‌ ‌రోజు రోజుకు పాదయాత్ర చేస్తున్న కొద్ది ప్రజలలో విపరీతమైన స్పందన వస్తున్న విషయం పాదయాత్రను చూసిన వారికి అర్థం అవుతుంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌చేసిన మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రతో పోల్చితే రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో గొప్ప మార్పులు తీసుకవచ్చింది అని చెప్పవచ్చు.

వచ్చే ఎన్నికలలో ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో అత్యధిక స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ రెండవ విడత పాదయాత్ర ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో కొనసాగింది. ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో మొదటి నుంచి కూడా బిజెపి బలంగా ఉంది దానికి తోడు ఈ ప్రజా సంగ్రామ యాత్రను ఈ ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో నిర్వహించడంతో బిజెపి పార్టీ ఈ ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో తిరుగు లేని శక్తిగా అవతరించింది . వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరవేయ్యడం ఖాయం అని పాదయాత్ర ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది.

బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రను తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చెయ్యడానికి, రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతిని భూస్థాపితం చెయ్యడానికి , తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను అంతం చెయ్యడం కోసం పోరాటం చేస్తున్నారు.టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంతవరకు తెలంగాణ అభివృద్ధి జరగదని, అవినీతి అరాచకాలు మాత్రం రోజు రోజుకు పెరుగు తున్నాయని బండి సంజయ్‌ ‌యాత్రలో వివరించారు.అంతే కాదు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు,నియామకాల కోసం ఏ లక్ష్యం కోసం,ఏ ఆశయం కోసమైతే తెలంగాణ ఏర్పడిందో ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వెయ్యడం లేదు. నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది, నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆ నిధులను ఒక క్రమపద్దతి ప్రకారం కేటాయించడంలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక నియామకాల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఖాలీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులపై టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కక్ష్య సాధిస్తున్న విషయం వాస్తవం అని తెలంగాణ సమాజానికి అర్థం అయ్యేలా బండి సంజయ్‌ ‌వివరించారు.

బండి సంజయ్‌ ‌నిర్వహించిన రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంతో బిజెపి శ్రేణులలో ఒక నూతన ఉత్తేజం రావడం జరిగింది. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఒక్కసారి గమనిస్తే తెలంగాణలో వచ్చే అస్సెంబ్లీ ఎన్నికలలో బిజెపి జెండా ఎగరవేయ్యడం ఖాయం అని స్పష్టమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఒక లక్షకు పైగా జనం హాజరుకావడంతో తెలంగాణలో బిజెపి బలం ఎందో మరొకసారి చాటి చెప్పింది. ఈ బహిరంగ సభలో ఊహించిన దానికంటే భారీ స్థాయిలో విజయవంతం కావడంతో టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో అలజడి మొదలైంది.ఎన్నికల వాతావరణం రాకముందే అమిత్‌షా బహిరంగ సభతో బిజెపికి విశేష స్పందన రావడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చారు. దీంతో ఈ ప్రజా సంగ్రామ యాత్రకు అన్ని వర్గాల మద్దతు సంపూర్ణంగా ఉందనేది కూడా తెలిసిపోయింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మరియు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో నిత్యవసర ధరలు బాగా పెరిగి పేద, మద్య తరగతి ప్రజలకు బ్రతకడం చాలా కష్టమైందని చెప్పవచ్చు, దానికి తోడు రాష్ట్రంలో బస్‌ ‌టిక్కెట్ల ధరలు పెంచడం, విద్యుత్‌ ‌చార్జీలను పెంచి పేద, మద్య తరగతి ప్రజల జీవితం అగమ్యగోచరంగా తయారయిందని బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలకు వివరించారు. అయితే ఈ పెంచిన విద్యుత్‌ ‌చార్జీలను గత ఏప్రిల్‌ ‌నెల నుంచే అమల్లోకి వచ్చినప్పటికీ.. గడిచిన ఏప్రిల్‌ ‌నెలతో పోల్చితే మే నెలలో విద్యుత్‌ ‌చార్జీలు ఎక్కువగా వచ్చాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.అందుకే ఈ ప్రజా వ్యతిరేక టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలని పాదయాత్రలో బండి సంజయ్‌ ‌ప్రజలను కోరారు.

రాష్ట్రంలో జరిగే చాలా అభివృద్ధి పథకాలలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా రాష్ట్రంలో అభివృద్ధిని మనం ఊహించలేం, గ్రామ పంచాయితీలకు వచ్చే నిధులు కేంద్రానివే , రూపాయికి కిలో బియ్యం కేంద్రానివే , గ్రామాలతో పాటు రాష్ట్రంలో వేసే ప్రతి రోడ్డులో కేంద్రం నిధులే ఉన్నాయి.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ప్రకటించి ఆ అభివృద్ధి పనులు కొనసాగుతుండగా వాటికి అదనంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులను మరింత విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరి తాజాగా తెలంగాణకు వచ్చి దాదాపు 9 వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి నిధులు ప్రకటించి సహాకరిస్తున్న విషయం వాస్తవం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ మాత్రం సహకరించడం లేదని టీఆర్‌ఎస్‌ ‌నాయకులు విమర్శలు చేస్తున్నారు అయినప్పటికీ ప్రస్తుతం జరిగే వాస్తవ పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం సంక్షేమం , ప్రగతే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీని దేశ వ్యాప్తంగా ప్రజలు విశ్వసిస్తున్నారు.దేశంలో నరేంద్రమోడీ అవినీతిరహిత పాలన, కుటుంబ రహిత పాలనను చూస్తున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వనా గత 8 సంవత్సరాల పరిపాలనను ఒక్కసారి పరిశీలిస్తే భారతదేశంలో ఎప్పుడు జరగనంతా అభివృద్ధి ప్రస్తుతం ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని అందిస్తున్నారు. అందుకే దేశ ప్రజలు మొత్తం నరేంద్రమోడీ కి జేజేలు పలుకుతున్నారు.

కేతూరి శ్రీరామ్‌,
ఏంఎ ‌పొలిటికల్‌ ‌సైన్స్
ఉస్మానియా యూనివర్సిటీ.
9640300169.
Comments (0)
Add Comment