రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్వేయం

వనపర్తి,జూన్‌,26 (‌ప్రజాతంత్ర విలేకరి): రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు వనపర్తి జిల్లాలో ని గోపాల్‌పేట రేవల్లి మండలాలలో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే హరితహారంలో భాగంగా చెట్లును నాటి పర్యవరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు రైతే కేసిఆర్‌ ‌మొదటి ప్రాధాన్యమని వ్యవసాయ రంగానికి అగ్రస్థానంగా నిలిచారన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన అని చెప్పారు.  రైతు బతికితే పల్లెలో నలుగురు బతుకుతారని మూడు రోజుల్లో కోటు 33లక్షల77వేల ఎకరాలకు సంబంధించి 54.22లక్షల మంది రైతులకు 6888.43 కోట్లు రైతుబంధు నిధులను ఖాతాలో జమచేయడం జరిగిందని అన్నారు.

సాగుబాగుపడాలన్న ఉద్దేశ్యంతోనే దేశంలో ఎక్కాడలేనటువంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. అన్నంపెట్టే రైతు అప్పులో ఉండవద్దన్నది తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. అందుకే కరోనా వంటి విపత్కర పరిస్థితిలోను రైతు బంధు నిధులు విడుదల చేసి కేసిఆర్‌ ‌ప్రభుత్వ లక్ష్యాన్ని చాటారన్నారు. దండగన్న వ్యవసాయాన్ని ఆరేండ్లలో పండుగగ చేశామని గుర్తుచేశారు. గత వానాకాలం యాసంగిలో కలిపి 1.30కోట్ల టన్నుల ఆహాకధాన్యాలు తెలంగాణలో పండాయి. ఇది చరిత్రలోనే రికార్డు అని తెలిపారు.ఫుడ్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా దేశవ్యాప్తంగా 83.01 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తే అందులో తెలంగాణ రాష్ట్రం నుండే 52.23 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించింది. గత ఆరేళ్ల తెలంగా ప్రభుత్వ చర్యల మూలంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది.అన్నారు. మొక్కలు పెంచడం మన సామాజిక బాధ్యత అని, మనిషికో మొక్క నాటి సంరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపిలు, జడ్పిటిసిలు, సర్పంచులు, అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

farmer kingGovernment
Comments (0)
Add Comment