కొరోనాపై నిజాలు దాస్తున్న ప్రభుత్వం

తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: ప్రొ .కోదండరామ్‌
‌కొరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కొరోనాపై ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోవిడ్‌ ‌నిబంధనలు అనుసరించి పార్టీ కార్యాలయంలో కోదండరాం జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోవిడ్‌కు బలైన పాత్రికేయులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీజేఎస్‌ అధినేత మాట్లాడుతూ ఆస్తులు పోగేసుకోవడానికి కాదు.. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. గడిచిన మూడేళ్ళ మాదిరిగానే భవిష్యత్‌లోనూ ప్రజలపక్షాన రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు ప్రశ్నించడం వలనే ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించి చేతులు దులుపుకుం దన్నారు. ప్రభుత్వం వైద్య సదుపాయాలను కల్పించలేకపోయుందని విమర్శించారు. ప్రభుత్వం చేతులెత్తేయటంతో ప్రజలే స్వచ్చందంగా కొరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ‌విధించుకుంటున్నారని తెలిపారు. కొరోనా బారిన పడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

Comments (0)
Add Comment