ఎన్నిక ఏదైనా గెలుపు గులాబీ దళానిదే..

సీఎం కేసీఆర్‌ ‌సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష – రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

గోదావరిఖని : రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం ఖచ్చితంగా గులాబీ దళానిదే అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం గోదావరిఖని నగరం మార్కం డేయ కాలనీలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అధ్యక్షతన రామగుండం కార్పొరేషన్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ మహిళ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రామగుండం మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ ‌గెలుపు గుర్రాలు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్క టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్త ఎమ్మెల్యే చందర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకోసం సర్వం సిద్దం గా ఉన్నారన్నారు. చందర్‌కు ప్రతి డివిజన్‌లో చేపట్టాల్సిన పనులు, చేయాల్సిన అభివృద్ధి పట్ల స్పష్టమైన విజన్‌ ఉన్ననాయకుడు అన్నారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచిననాటి నుండి నగరంలోని ప్రతి ఏరియాను జల్లెడ పట్టారని వివరించారు. అంతే కాకుండా సీయం కేసీఆర్‌ ‌చేపడుతున్న సంక్షేమ పథకాల లబ్ది దారులు ప్రతి ఇంటిలో ఉన్నారని వారి ఆశీస్సులు టీఆర్‌ఎస్‌కు మెండుగా ఉన్నాయన్నారు.
ఆడ పడుచుల ఆశీర్వాదంతో ముందుకు సాగుదాం.. : ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌
‌రామగుండం మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు 50 డివిజన్లు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కైవసం చేసుకుంటుందని ఇందుకోసం మన ఆడ పడుచుల ఆశీర్వాదంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రామగుండం మహిళలు చైతన్యవంతులని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలకు కాలం చెల్లిందని, వారు అభ్యర్థుల కోసం వేట ఇంకా కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. మహిళలు ఆర్థిక స్వావలంబన చేకూర్చుకునేందుకు 44 లక్షల డీఎంఎఫ్‌ ‌నిదులనుమంజూరు చేశామని వివరించారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్‌ ‌మూల విజయారెడ్డి, అంతర్గాం, పాలకుర్తి జడ్పీటీసీ ఆముల నారాయణ, కందుల సంధ్యారాణి, టీఆర్‌ఎస్‌ ‌నాయకులు చెరుకు బుచ్చిరెడ్డి, సీహెచ్‌ ‌మొగిలి, జాహిద్‌ ‌పాషా తదితరులు ఉన్నారు.

Tags: The election, pink rose symbol party, eshwary dhima, godavari

eshwary dhimagodavaripink rose symbol partyThe election
Comments (0)
Add Comment