టర్కీ, సిరియాలో అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

  • సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారిన పరిస్థితులు
  • ఇరు దేశాల్లో 4,500కు పైగా భూకంప మృతుల సంఖ్య
  • భూకంప ధాటికి కకావికలం…సిరియాలో శిథిలాల కిందే చిన్నారికి జన్మ..తల్లి మృతి
  • టర్కీకి బయలుదేరిన భారత్‌ ‌సహాయక బృందాలు
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : యావత్‌ ‌ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇరు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 4,500కు పైగా చేరిందని అక్కడి డియా సంస్థల ద్వారా తెలుస్తోంది. భారీ భూకంపాల ధాటికి టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి. పేక మేడల్లా కూలిన భారీ భవనాల కింద ఉన్న మృతదేహాలను బయటకు వెలికితీస్తున్నారు. సోమవారం  ఒక్కరోజే టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ఘటనల్లో 4 వేల మందికిపైనే ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితులు ఎంత హృదయవిదారకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. భూకంపం ధాటికి ఊరు, పట్టణాలనే తేడా లేకుండా మరు భూములుగా మారిపోయాయి. టర్కీ, సిరియాలో భూకంపం ప్రకోపానికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. రెండు దేశాల్లోనూ రెస్క్యూ ఆపరేషన్‌ ‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోడ్లు దెబ్బతినడం, కరెంట్‌, -ఇం‌టర్నెట్‌ ‌సేవలకు అంతరాయంతో పాటు చాలాచోట్ల మంచి నీటి సరఫరాకు విఘాతం ఏర్పడింది. దాంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వేల మంది ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ రెండు దేశాల్లోనూ శిథిలాల చిక్కుకున్న వాళ్లను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో.. ఇప్పటిదాకా 4వేలకు పైగా మృతదేహాలను వెలికి తీశారు. టర్కీ చరిత్రలోనే ఇది భారీ భూకంపంగా నమోదైంది. అధికంగా మృతుల సంఖ్య కూడా ఇక్కడే నమోదు అయ్యిందని తెలుస్తోంది. భారీ ప్రకంపనల ధాటికి సెకన్ల వ్యవధిలోనే వందల సంఖ్యలో పెద్ద పెద్ద బిల్డింగులు కుప్పకూలడం ఒక  ఎత్తయితే.. అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నాటి భూకంపం ధాటికి 14వేల పైనే గాయపడగా.. వీళ్లలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సిరియాలోనూ క్షతగాత్రులు నాలుగు వేల మందికి పైనే ఉండొచ్చని అనధికార లెక్కలు చెబుతున్నాయి. వారం పాటు టర్కీ సంతాప దినాలు ప్రకటించింది.  భూకంపం ధాటికి సిరియాలోని అలెప్పో, లటాకియా, హమా, టార్టస్‌ ‌ప్రాంతాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. పైగా  విషాదానికి ముందే అలెప్పోలోని రష్యా యుద్ధ స్థావర కేంద్రం కూడా అయిన ప్రాంతాల్లో  భవనాలు కొన్ని కూలిపోతూ వస్తున్నాయి. పాశ్చాత్య, అగ్ర దేశాలతో పాటు భారత్‌ ‌సహా మొత్తం 12 దేశాలు టర్కీకి తక్షణ సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే రిలీఫ్‌ ‌మెటీరియల్‌ను టర్కీకి పంపించాయి. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపాల ధాటికి పెద్ద పెద్ద బిల్డింగులు పేకమేడల్లా నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే టర్కీలోని హతయ్‌ ‌ప్రావిన్స్‌లో ఉన్న ఎయిర్‌పోర్టులో రన్‌వే భూ ప్రకంపనల ధాటికి రెండు ముక్కలైంది. హతయ్‌ ఇం‌టర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోని రన్‌వే తీవ్రంగా ధ్వంసమైంది. భారీగా పగుళ్లు ఏర్పడి రన్‌వే రెండుగా చీలిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌‌డియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఎయిర్‌పోర్టులో ఉన్నతాధికారులు విమాన రాకపోకలను నిలిపివేశారు. భూకంప తీవ్రతకు ఒక్క టర్కీలోనే 5600లకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. రెండు దేశాల్లో ఇప్పటివరకు 4500 మందికిపైగా మృత్యువాత పడగా.. దాదాపు 20వేల మంది గాయపడ్డారు.


భూకంప ధాటికి కకావికలం…సిరియాలో శిథిలాల కిందే చిన్నారికి జన్మ..తల్లి మృతి
ప్రకృతి ప్రకోపంతో టర్కీ, సిరియా దేశాల్లో రక్తమోడుతోంది.  ఓవైపు పుట్టుక అదే సమయంలో మరోవైపు మరణం సంభవించింది. శిథిలాల కిందే బిడ్డను ప్రసవించి కన్నుమూసిందో కన్నతల్లి. టర్కీ, సిరియాలో ఎటు చూసినా కుప్ప కూలిన భవనాలు.. శిధిలాల మధ్య అహకారాలు.. శవాల దిబ్బలను తలపిస్తున్న క్రమంలో సిరియా అలెప్పోలో ఓ తల్లి బిడ్డను ప్రసవించింది. అదీ శిథిలాల కిందే..తల్లి ఓ పండంటి బిడ్డను ప్రసవించింది. అయితే దురదృష్టం కొద్దీ ప్రసవించిన వెంటనే చిన్నారిని కనులారా చూడక ముందే ఆ తల్లి కన్నుమూసింది. శిథిలాల తొలగింపు క్రమంలో ఇది గమనించిన స్థానికులు.. ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకబడగానే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పసి బిడ్డకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది.

టర్కీకి బయలుదేరిన భారత్‌ ‌సహాయక బృందాలు
వరుసగా సంభవించిన మూడు భూకంపాల వల్ల టర్కీ తీవ్రంగా నష్టపోయిన క్రమంలో టర్కీని ఆదుకునేందుకు భారత్‌ ‌ముందుకు వచ్చింది. ఘజియాబాద్‌లోని హిండోన్‌ ‌వైమానిక స్థావరం నుంచి ఈ సహాయక బృందాలు బయల్దేరాయి. ఆపదలో చిక్కుకున్న టర్కీకి భారత దేశం తక్షణం ఆపన్న హస్తం అందజేసింది. సహాయక బృందాలను, సామాగ్రిని పంపిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే అవి భారత వైమానిక దళ విమానంలో బయల్దేరాయి. నిపుణులైన జాతీయ విపత్తు స్పందన దళం బృందాలు, అత్యంత నైపుణ్యంగల జాగిలాల స్క్వాడ్స్, ఔషధాలు, అడ్వాన్స్‌డ్‌ ‌డ్రిల్లింగ్‌ ఎక్విప్‌మెంట్‌, ‌సహాయక చర్యలకు అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలు వీటిలో ఉన్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ‌బృందంలో మహిళలు కూడా ఉన్నారు.

Comments (0)
Add Comment