ఓ ‌చీకటి చెప్పింది

నీలో నిశి వాంఛలు దాగున్నాయని..
ఓ వెన్నెల రాజు చెప్పాడు
నీలో అనుమానం అనే
బీజం మొలకెత్తిందని
ఓ ప్రత్యక్ష దైవం చెప్పాడు
నీవన్నీ ఆకట్టుకునే
కట్టు కథలే అని..
ఇవన్నీ మేళవించి
నీ మోము చూస్తే
ముసుగుతో కూడిన
చిరునవ్వు సాక్షాత్కరించింది..
ఇవన్నీ గుర్తించని నా మది
మాతృ ప్రేమలో సంపూర్ణతలా
స్వచ్ఛమైన హరితమైన
ప్రేమను నీకు అందిస్తే
దప్పిక తీరని ఎడారిని చేసావు
చాటింగ్‌ ‌సంభాషణ
ప్రేమకు ప్రేరణ అని
నువ్వనుకున్నావు..
ప్రేమను మించిన ఆరాధనే
అమూల్యం అని
నేను అనుకున్నాను..
మన ప్రేమ సఫలం కావాలంటే
ఆరాధనే పునాది కావాలి.
ఆకర్షణే మూలంగా భావించే
నీ నీడన ఆరాధన అనే
వెలుతురు కన్పించడం
అతిశయోక్తి అవుతుందేమో..
– ప్రియ గోలి…
8500881385… గుంటూరు..

prajatantra newsTelangana news updatestelugu short newstelugu vaarthaluthe dark saidtoday breaking updates
Comments (0)
Add Comment