లాఫింగ్‌ ‌బుద్ధ

పూర్తిగా
మనోదేహాల్ని
ఏకాగ్రతా బిందువుకు
సంధించి
అంతరాంతరాళాల్లో
అనాధి నుంచీ
పూడ్చి వేయబడి
సలసల విషం గక్కుతూ
మదిపై హృదిపై పడి
మసిలి చల్లారి
నరనరాల్లో కణకణాల్లో
కలిసి
తుప్పు పట్టిపోయిన
చరిత్ర అవమానపు
శిలా శకలాలను తవ్వి
వివేక విస్ఫోటనపు
కొలిమిలో పడేసి
కరడుగట్టిన
కసాయితనాన్ని సైతం
కరిగించే కణికల మధ్య
సానబెట్టి
పసిపాపల నవ్వుల
‘బుద్ధు’లను
వెలికి తీసే ఈ చర్యకు
ప్రపంచ మానవాళిని
సన్నద్ధం చేసేందుకు
నా దేశం నుంచి
నా ప్రజల నుంచి
హామీ పత్రం!

– రఘు వగ్గు

Comments (0)
Add Comment