తెలంగాణ రాష్ట్రం.. ధనిక రాష్ట్రం ఎలా..?

“ఆ ‌రాష్ట్రం లోని ప్రతి పౌరుడి కొనుగోలు శక్తి, తలసరి ఆదాయం , జీవన ప్రమాణం మొదలగునవి మెరుగుపడాలి. మరియు ఆ రాష్ట్ర ప్రైవేట్‌ ‌మరియు ప్రభుత్వ రంగం మధ్య ఆదాయ వ్యత్యాసాలు, హోదా తారతమ్యం, గుర్తింపు మరియు గౌరవం సమానంగా ఉండాలి. కాని మనరాష్ట్రంలో ప్రభుత్వరంగానికి మరియు ప్రైవేట్‌ ‌రంగానికి మధ్య భూమికీ ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా స్పష్టంగా కనపడుతుంది.”

ఒక రాష్ట్రము కానీ దేశం కాని ఆర్థి కంగా ధనిక మైన దిగా గుర్తింప బడా లంటే ఆ రాష్ట్ర ఖజానా పరి మాణం కాదు, ఆ రాష్ట్రం లోని ప్రతి పౌరుడి కొనుగోలు శక్తి, తలసరి ఆదాయం , జీవన ప్రమాణం మొదలగునవి మెరుగుపడాలి. మరియు ఆ రాష్ట్ర ప్రైవేట్‌ ‌మరియు ప్రభుత్వ రంగం మధ్య ఆదాయ వ్యత్యాసాలు, హోదా తారతమ్యం, గుర్తింపు మరియు గౌరవం సమానంగా ఉండాలి. కాని మనరాష్ట్రంలో ప్రభుత్వరంగానికి మరియు ప్రైవేట్‌ ‌రంగానికి మధ్య భూమికీ ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా స్పష్టంగా కనపడుతుంది. మన రాష్ట్రంలో సొంత ఇండ్లు లేని వాళ్లు లక్షలలో ఉన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు లేకపోలేదు. చదువుకున్న వ్యక్తులందరికి ఉపాధి కల్పించేంతలా మౌళిక సదుపాయాల నిర్మాణంగాని , ప్రైవేట్‌ ‌వ్యవస్థ అభివృద్ధి కాని జరుగ లేదు.

మన రాష్ట్రంలో పి.హెచ్‌.‌డీలు చేసి కూడా ఉపాధిహామి పనులకు, కూలి పనులకు లాక్‌డౌన్‌ ‌కాలంలో వెళుతున్నారంటే రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టులు నిర్మించినంత మాత్రాన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగ మార్చలేము. దాని కంటే ముందు ప్రజల జీవితాలు బంగారు మయం కావాలి. దానికి చదువుకు తగ ్గఉపాధి, దానికి సమానమైన వేతనం పొందేలా చూడాలి. ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు లాక్‌డౌన్‌ ‌కాలంలో కూడా వేతనం పొందితే ప్రైవేట్‌ అధ్యాపకుడు పస్తులున్నాడు, కొన్నిచోట్ల ఆత్మహత్యలు కూడా నమోదు అయ్యాయి. ఇది ధనిక రాష్ట్రాలకు ఉండాల్సిన లక్షణం కాదు. ఇలా ప్రతిరంగంలో జరుగుతుంది. బీదవాడు ధనికునిగా మార్చబడినప్పుడే ఈ రాష్ట్రము ధనిక రాష్ట్రంగా పిలువబడుతుంది. ఈ మధ్య వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మంచిదే కానీ దానితో పాటు ఇతర రంగాలు కూడా అభివృద్ధికి నోచుకోవాలి. తెలంగాణలో కుల వృత్తులు చేసుకుంటూ జీవనం కొనసాగించే వారి సంఖ్య అధికం. వీరి జీవన ప్రమాణాలు, స్థాయి ఇప్పటి వరకు మారలేదు, ఇప్పటికి పెద్దసంఖ్యలో ప్రజలు, ప్రభుత్వం ఇచ్చే బియ్యం, రుణమాఫీ, నగదు సహాయం కోసం ఎదురు చూడడం జరుగుతుంది. కావున రాష్ట్రంలో విద్యారంగం, పారిశ్రామిక రంగం మరియు ఇతర రంగాలు, అభివృద్ధిచెంది, ప్రతి ఒక్కరికి చేతి నిండా పని కల్పించి, కడుపు నిండా తిండిపెట్టి ,కంటి నిండా నిద్రపోయే అవకాశాలు సృష్టింపబడినప్పుడే మనల్ని మనం ధనికులుగా పిలుచుకోవాలి అనేది అక్షరసత్యం.

ఈ నగరానికి ఏమై ంది ….
తెలంగాణ తలమానికం, రాష్ట్ర ఆర్థిక వనరు, చారిత్రాత్మక కట్టడాలకు నిలయం, ఉపాది •కోసం వెళ్లిన వారికి కడుపులో పెట్టుకొనిచూసుకునే తల్లి , రాష్ట్ర ఐటిహబ్‌, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేరులతో పిలువబడేమన భాగ్యనగరం ఈ రోజు ఎటుచూసినా హాహాకారాలు, చావు వార్తలు, ఎవరో బలవంతంగా నెట్టేసినట్టు పట్టణం వదిలిపారిపోతున్న ప్రజలు. ఇందులో కొందరు ఎక్కడ తాము కొరోనా రక్కసి కంటపడుతామో అని దాక్కోడానికి సొంతూర్లకు పయనమవుతుండగా, మరికొందరు ప్రభుత్వం మళ్ళీ లాక్‌ ‌డౌన్‌ ‌విధిస్తే ఎక్కడ ఇరుక్కు పోతామో అన్న భయంతో ఆదరబాదరగా హైదరాబాదును దాటు తున్నారు. ఇందులో ధనిక, పేద, వృత్తులతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుంది. పెరుగుతున్న కోవిడ్‌ ‌కేసులకు తోడు ఇప్పటికి పూర్తి స్థాయిలో పని దొరకక ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారులు , ఇప్పటికి విద్యాసంస్థలు తెరుచుకోకపోవడం, సాఫ్ట్‌వేర్‌ ‌సంస్థలు వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌పెట్టడం, వాణిజ్య సంస్థలలో పూర్తి స్థాయిలో వస్తు డిమాండ్లు లేకపోవడంతో నో వర్క్ ‌నో పే ప్రకటించడం, పర్యాటకుల అనుమతి లేకపోవటంతో దానిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డవారు ఉపాధి కోల్పోవడం, సినిమా థియేటర్‌ ‌మూతపడటం, కొంతమందికి ఉపాధి దొరికిన పూర్తి వేతనం దొరకక పోవడంతో అది కాస్త అద్దెలు కట్టడానికే సరిపోతుండటం ఇలా అనేక కారణాలు పట్టణాన్ని వదిలే విధంగా ప్రేరేపిస్తున్నాయి.

కేవలం ప్రత్యామ్నాయం లేని వాళ్లుకొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పూర్తి స్థాయిలో స్థిరపడ్డ వాళ్లు, ఎంతో కొంత ఆదాయం వచ్చే వారు ఇక్కడ ఉండటం జరుగుతుంది. హైదరాబాద్లో అద్దె ఇల్లుదొరకడమే కష్టం, కొరోనా చేయబట్టి ఎటుచూసినా, ఎక్కడ చూసినా టులెట్‌ ‌బోర్డులు దర్శనమిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ మన రాజధాని తాను పోషిస్తున్న కుటుంబాలను ఎప్పుడు తన వైపు పిలుస్తుందో అన్న ప్రశ్నకు సమాధానం లేదనే చెప్పాలి. అసలు వైరస్‌ ఇం‌తగా ప్రబలడానికి కారణాలను విశ్లేషిస్తే అనేక సందేహాలు పుట్టుకొస్తాయి … సడలింపులు తొరగా జరిగాయా? అనుకున్నంత సంఖ్యలో కోవిడ్‌ ‌టెస్టులు జరపబడలేదా, వేరే ప్రాంతాల వారు ఒకేసారి పట్టణం మీద వాలడమా.? ఇటీవల కురిసిన వర్షాలా, నాసిరకమైన డ్రైనేజ్‌ ‌వ్యవస్థనా, లేదా కొరోనా శక్తి సామర్థ్యాలను అంచనావేయడంలో పొరపాటు చేశామా ఇలా ఎన్నో సందేహాలు సగటు మానవున్ని ఆలోచింప చేస్తున్నాయి.

డా।। ఎండి ఖ్వాజామొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫై•నాన్స్

How is richest statemigrantsTelangana state
Comments (0)
Add Comment