జులై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎం‌సెట్‌

తెలంగాణ ఎంట్రెన్స్ ‌టెస్టుల షెడ్యూల్‌ ‌విడుదల

తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదలైంది.. జులై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు టీఎస్‌ ఎం‌సెట్‌ ‌జరగనుండగా.. జులై 1వ తేదీన టీఎస్‌ ఈసెట్‌ ‌నిర్వహించ నున్నారు.. ఇక, జూన్‌ 20‌వ తేదీన పీజీఈ సెట్‌ ‌నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్‌, ఈసెట్‌ను జేఎన్‌టీయూ నిర్వహించనుండగా… పీజీ ఈసెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఇక, టీఎస్‌ ఐసెట్‌, ‌టీఎస్‌ ఎడ్‌సెట్‌, ‌టీఎస్‌ ‌లాసెట్‌, ‌టీఎస్‌ ‌పీఈసెట్‌ ‌తేదీలు నిర్ణయించాల్సి ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటనలో పేర్కొంది.

కాగా, కరోనా వైరస్‌ ‌తగ్గుముఖం పట్టడంతో.. ఇప్పటికే తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. క్రమంగా పరీక్షల నిర్వహణపై కూడా దృష్టి సారించింది. ఇక, తెలంగాణ కామన్‌ ఎం‌ట్రెన్స్ ‌పరీక్షల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి.. గత ఏడాది నిర్వహించిన యూనివర్సిటీలకే ఈ సారి కూడా ఆయా ఎంట్రెన్స్ ‌ల నిర్వహణ బాధ్యత అప్పగించింది.. అయితే, కొన్ని సెట్స్ ‌కి కన్వీనర్‌లను మార్చేసింది.. 7 కామన్‌ ఎం‌ట్రెన్స్ ‌టెస్ట్ ‌లకు గాను మూడు ఎంట్రెన్స్ ‌టెస్ట్‌ల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యామండలి.. మిగతా ఎంట్రెన్స్ ‌లు డిగ్రీ పరిక్షీలతో ముడిపడి ఉండడంతో పెండింగ్‌లో పెట్టింది.

ఐసెట్‌, ఎడ్‌సెట్‌, ‌లాసెట్‌, ‌పీఈసెట్‌ ‌పరీక్షల తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఎంసెట్‌, ఈసెట్‌ ‌పరీక్షలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. పరీక్షల షెడ్యూల్‌ ‌ప్రకారం జూన్‌ 20‌న పీజీ ఈసెట్‌, ‌జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్‌, ‌జూలై 1న ఈ-సెట్‌ ‌జరుగనుంది.

degree levelTeaching in English mediumTelangana Entrance Tests
Comments (0)
Add Comment