పత్తి చేనులో గంజాయి సాగు గంజాయి మొక్కలను చూపుతున్న తాసిల్దార్‌

నిషేధిత మైన అంతర్‌ ‌పంటలను పండిస్తే కటకటాల ఫాలు అవుతారని తాసిల్దార్‌ ‌విజయ్‌ ‌కుమార్‌ అన్నారు. సోమవారం మండలంలోని ఉప్పరగూడెం గ్రామ శివా రు మాంజా తండాలో వివాదంలో ఉన్న భూమి సర్వే కోసం వెళ్లిన తాసిల్దార్‌ ‌విజయ్‌ ‌కుమార్‌ ‌పక్కనే ఉన్న పత్తి చేలో గంజాయి మొక్కలు కనిపించడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ మొక్కలను ధ్వంసం చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాంజా తండాకు చెందిన మాలోత్‌ అనిల్‌ ‌కు చెందిన భూమి సర్వే నెంబర్‌ 538‌లో పత్తి పంట సాగు చేస్తున్నాడు అందులో అంతరపంటగా 15 గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.నిషేధిత పంట గంజాయిని పెంచటం పెద్ద నేరమని ఎవరో కూడా ఇలాంటి అంతర పంటలు వేయవద్దని ఆయన సూచించారు. ఆయన వెంట సీరోలు ఎస్సై చంద్రమో హన్‌, ‌రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ ‌జంపయ్య, వీఆర్‌ఓ ‌జోష్న, రైతులు పోలీస్‌ ‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: Xero Chandramo Hahn, Revenue Inspector Zampiah, VRO Sonya, Farmers Police Trouble

Farmers Police TroubleRevenue Inspector ZampiahVRO SonyaXero Chandramo Hahn
Comments (0)
Add Comment