ఆహ్లాదకరంగా ప్రకృతికి నిలయం తారకరామ ప్రకృతి వనం

ఎమ్మెల్యే డా సంజయ్‌ ‌కుమార్‌
‌ప్రకృతివనం… పట్టణ ప్రజల ఆరోగ్య నందనవనం
మున్సిపల్‌ ‌చైర్పర్సన్‌ ‌భోగ శ్రావణి
జగిత్యాల అర్బన్‌, ‌జులై 24 (ప్రజాతంత్ర విలేఖరి) : ఇక్కడ ప్రకృతి సౌందర్యాలు అనంతం. ఆ ప్రకృతికి, సహజత్వానికి మరింత శోభనిచ్చేలా తారకరామ ప్రకృతి వనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ‌కుమార్‌ అన్నారు. శనివారం ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్‌ ‌జన్మదినం సందర్భంగా టిఆర్‌ ‌నగర్‌ ‌లో జగిత్యాల మున్సిపాలిటీ ప్రతిస్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘’తారకరామ ప్రకృతి వనం’’ ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే డా సంజయ్‌ ‌కుమార్‌ , ‌మున్సిపల్‌ ‌చైర్పర్సన్‌ ‌భోగ శ్రావణి తో కలసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర పురపాలక మంత్రి కేటిఆర్‌ ‌జన్మదినం సందర్బంగా ముక్కోటి వృక్షర్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదాద్రి తరహాలో చిట్టడవిని టిఆర్‌ ‌నగర్‌ ‌లో ఏర్పాటు చేసుకోవడం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని, ఈ చిట్టడవికి తారకరామ ప్రకృతి వనం గా ఏర్పాటు చేయడం సంతోషం వ్యక్తం చేశామన్నారు.

హైదరాబాద్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌సెక్రటరీ అరవింద్‌ ‌కుమార్‌, ‌డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ‌సత్యనారాయణ రావు, డి ఎఫ్‌ ‌వో, ప్రిన్సిపాల్‌ ‌చీఫ్‌ ‌శోభ జగిత్యాల పట్టణ సమీపంలోని తారకరామా ప్రకృతి వనం, చిట్టడవి ని తెలంగాణ రాష్ట్రం లో దిబేస్ట్ ‌చిట్టడవి అని ప్రశంసలు అందించారాని అన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో వనాల/గ్రామీణ సహజ వనాల (పార్కులు) నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్వయంగా ఆధ్వర్యంలో జరగబోతోందని, పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్కులు పల్లెల్లోనూ కనువిందు చేస్తున్నాయన్నారు. ఈ వనాల్లో ఆహ్లాదాన్ని నింపేలా సేద తీరేలా.. అన్ని రకాల పూలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే భారీ వృక్షాలు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే వృక్షాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం అందుబా టులో ఉన్న స్థలాలను సేకరించి, హరిత హారంలో భాగంగానే ఈ ప్రకృతి వనాలను తీర్చిదిద్దనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఇందుకోసం వినియోగించమన్నారు.

ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక ఎకరం విస్తీర్ణానికి తగ్గకుండా ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కొన్ని గ్రామాల్లో వేర్వేరు ప్రదేశాల్లో స్థలం అందుబాటులో ఉంటే చిన్న చిన్న వనాలను ఏర్పాటు చేశామని, ప్రతి గ్రామంలోనూ కనీసం ఒకటైనా ప్రకృతి వనం ఏర్పాటు చేయడానికి వీలుగా భూమిని అభివృద్ధి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్‌ ‌మాట్లాడుతూ జీవవైవిధ్యం ప్రకృతి వనాల్లో రెండేళ్లలోనే చిట్టడవి రూపుదిద్దుకుంటుందని మున్సిపల్‌ ‌చైర్పర్సన్‌ అన్నారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు దగ్గరదగ్గరగా నాటడం మియావాకీ పద్ధతి, కొద్ది ప్రదేశంలోనే గుబురుగా పెరిగి యాదాద్రి తరహాలోనే మినీ తారకరామా చిట్టడవి ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు చుట్టూ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం గుట్టల పక్కన టిఆర్‌ ‌నగర్లో నెలకొందని పక్షులు, పాములు, కప్పలు, ఉడతలు వివిధ జీవరాశులు వస్తాయి. జీవవైవిధ్యం ఏర్పడుతుందన్నారు.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌, ‌నారాయణ్‌పూర్‌ ‌వంటి చోట్ల అమలుచేసిన ఈ విధానం జగిత్యాల లో ఏర్పాటు చేశామన్నారు. ఆహ్లాదానికి నిలయంగా ప్రకృతికి కేరాఫ్‌ అ‌డ్రస్‌గా టిఆర్‌ ‌నగర్‌ ‌నిలుస్తున్నదని, పచ్చని చెట్లు సుగంధ ద్రవ్యాల మూలికలు పూలతో నందనవనాన్ని తలపిస్తున్నదని ప్రతి ఒక్కరు చిట్టడవి ని సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో గంధాలయ కమిటి చైర్మన్‌ ‌డా.చంద్రశేఖర్‌ ‌గౌడ్‌, ‌డి ఎఫ్‌ ఓ ‌వెంకటేశ్వర్‌ ‌రావు, ఇంచార్జి కమిషనర్‌ ‌లక్ష్మినారాయణ, వైస్‌ ‌చైర్మన్‌ ‌గోలి శ్రీనివాస్‌, ‌స్థానిక కౌన్సిలర్లు దేవేందర్‌ ‌నాయక్‌, ‌చాంద్‌ ‌పాషా, గౌరవ కౌన్సిలర్లు, కో.ఆప్షన్‌ ‌మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

andhrapradeshprajatantra newstelanganatelugu articlestelugu facts
Comments (0)
Add Comment