జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్‌

‌స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్‌ ‌బహుమతి లభించింది. నోబెల్‌ ‌ప్రైజ్‌ ‌కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అంతరించిన మానవ జాతుల విశ్వ జన్యురాశి, మానవ పరిణామానికి సంబంధించి ఆయన చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయనున్నారు. వైద్య రంగంలో నోబెల్‌ ‌బహుమతిని అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా భావిస్తారు. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నోబెల్‌ అసెంబ్లీ ఈ అవార్డు విజేతను ఎంపిక చేస్తుంది.

ఏటా డిసెంబర్‌ 10‌న నోబెల్‌ ‌బహుమతుల ప్రదానం జరుగుతుంది. ఈ అవార్డు కింద 10 మిలియన్‌ ‌స్వీడిష్‌ ‌క్రోన్‌లు (భారత కరెన్సీలో 7.20 కోట్లు) ఇవ్వనున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి నోబెల్‌ ‌బహుమతుల ప్రదానం జరగలేదు. ఇవాళ వైద్య రంగానికి సంబంధించి నోబెల్‌ ‌బహుమతి విజేతను ప్రకటించిన కమిటీ రేపు ఫిజిక్స్, 5‌వ తేదీన కెమిస్టీ, 6న లిటరేచర్‌, 7‌న నోబెల్‌ ‌శాంతి బహుమతి, 10న ఎకనామిక్స్ ‌విజేతలను ప్రకటించనుంది.

Comments (0)
Add Comment