సమస్యలపై స్వాజీ విమర్శలు

బెంగళూరు, జనవరి 27 : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామి వద్ద నుంచి మైక్‌ను లాక్కున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని మహదేవపురలో గురువారం  పౌరసరఫరాల శాఖపై స్వామిజీ విమర్శలు చేయడం ప్రారంభించారు.

నియోజక వర్గంలో వరదలు, మౌలిక సదుపాయాలు లేకపోవడాన్ని ప్రస్తావించారు. రాజకీయ నాయకులే ఈ ఇబ్బందులకు కారణమని ఆరోపించారు.దీంతో వెంటనే అలర్ట్ అయిన సీఎం… స్వామిజీ దగ్గర్నుంచి మైక్‌ ‌లాక్కున్నారు. తాను హాలు ఇచ్చేవాడిని కానని, కానీ సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేసినట్లు సీఎం స్పష్టం చేశారు.

Comments (0)
Add Comment