గణాంకాలు చెబుతున్న వివక్ష ..!

అరుణ, న్యూఢిల్లీ
గెస్ట్ ఎడిటర్‌

కొరోనా వైరస్‌ ‌కోవిద్‌ 19 ‌బాధిత కుటుంబాలకు ఆమెరికా 6000 డాలర్లు, జర్మనీ 7287 డాలర్లు బ్రిటన్‌ 5943 ‌డాలర్లు, స్పెయిన్‌ 4710 ‌డాలర్లు, జపాన్‌ 2215 ‌డాలర్లు, కెనడా 2175 డాలర్లు, యూరోపియన్‌ ‌యూనియన్‌ 1601, ‌ఫ్రాన్స్ 782 ‌డాలర్లు, సౌత్‌ ‌కొరియా 761 డాలర్లు, ఆస్ట్రేలియా 692 డాలర్లు, పాకిస్తాన్‌ 7000 ‌రూపాయలు, భారతదేశం 1200 రూపాయలు ఇలా కరోనా వైరస్‌ ‌వ్యతిరేక పోరాటానికి గాను.. తమ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి అందేలాగా ప్యాకేజీలు ప్రకటించాయి. రూపాయి(ఈ రూపాయలో నగదు పెట్టబడి, శ్రామికుల వేతనాలు కూడా వుంటాయి) పెట్టుబడి పెట్టి పది రూపాయలు సంపాదించి మార్కెట్‌ ‌నుండి ఒక రూపాయి(ఈ రూపాయలో నగదు పెట్టబడి శ్రామికుల వేతనాలు కూడా వుంటాయి) వెనక్కి తెచ్చుకోవటంతో పాటు లాభార్జనగా తొమ్మిది రూపాయలు సంపాదించాలి..అనే ఆర్థిక వ్యవస్థ భూమండలాన్ని కబళించి ఉన్న సమయంలో, కరోనా వైరస్‌ ‌భూమండలంపై పంజా విసిరింది. ఈ పంజా దెబ్బకి భూగోళం మీద ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతున్నది అన్న మాట మనం రోజూ వింటున్నాం.

ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌యుగంలో కరోనా వైరస్‌కి అశేష శ్రామిక ప్రజలు ఆహుతి అయిపోతే ఆర్థిక మాంద్యం ఎలా వస్తుంది..? అన్నది అత్యంత కీలక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం ద్వారానే.. వచ్చిన కరోనా మహమ్మారిని గానీ రానున్న మహమ్మరులు గానీ ఎదుర్కోవటం సాధ్యపడుతుంది. భూమండలం మీద ఉన్న 90% సంపదను హస్తగతం చేసుకున్న వారి స్నేహంతో నడిచే ప్రభుత్వాలు ఎందుకు అశేష శ్రామిక ప్రజల కోసం ప్యాకేజీ ప్రకటిస్తున్నాయి..? అన్నది అతి ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం మనదేశంలో వెతికి నట్లయితే ఆశ్చర్యకరమైన నిజాలు మనముందు ఉంటాయి.. ఆ నిజాలు ఏమిటో చూద్దాం..భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ ‌జన కళ్యాణ యోజన కింద ఒక లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే.. ఈ ప్యాకేజీ ప్రకారం భారతదేశంలో ఉన్న పేదలకు సంవత్సరం పాటు ఉచితంగా ఆహార అవసరాలు తీర్చాలి అంటే ఏడాదికి కావలసిన సొమ్ము ఏడు లక్షల కోట్ల రూపాయలు అని స్పష్టమౌతుంది. భారత ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఆహారం అందించాలంటే ఇంత మొత్తం ఖర్చు పెడితే భారత పౌరులు సోమరిపోతులు అయిపోతారు అని భావించి భారత దేశాన్ని అభివృద్ధి చేయటానికి భారత ప్రభుత్వం వేరు వేరు చోట్ల ఈ డబ్బుని పెట్టుబడి పెట్టింది అని భావించి.. భారత ప్రభుత్వం ఏ.. ఏ.. రంగాలలో ఎంత పెట్టుబడి పెట్టిందో గమనిద్దాం..భారత ప్రభుత్వం నడిపే బ్యాంకులు వివిధ రంగాలకు ఇచ్చిన అప్పులు.. మాన్యుఫాక్చరింగ్‌ ‌రంగానికి మూడు లక్షల డెబ్బైముడు వేల కోట్ల రూపాయలు, ట్రాన్స్పోర్ట్ ‌రంగానికి ఒక లక్షా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు, రియల్‌ ఎస్టేట్‌ ‌రంగానికి రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు, టూరిజం హోటల్‌ ఇం‌డస్ట్రీకి నలభై ఐదు వేల మూడు వందల తొంబై నాలుగు వేల కోట్ల రూపాయలు, నాన్‌ ‌బ్యాంకింగ్‌ ‌ఫైనాన్స్ ‌స్పెక్టర్‌ ‌కి ఏడు లక్షల ముప్పైఏడు వేల కోట్ల రూపాయలు, క్రెడిట్‌ ‌కార్డ్ ‌సెక్టరుకు ఒక లక్షల పది వేల కోట్ల రూపాయలు, ఆటో సెక్టర్‌ ‌రంగానికి రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు, చిన్న సన్నకారు పరిశ్రమలకు పదకొండు లక్షల కోట్ల రూపాయలు.. ఇలా బ్యాంకుల ద్వారా పెట్టుబడి పెట్టింది.

ఈ మొత్తం సొమ్ముతో భారతదేశంలో ఉన్న పేదలకు ప్రభుత్వం గనుక ఉచితంగ ఆహారం అందించగలదు అనుకుంటే.. మూడు సంవత్సరాల పాటు పేదలకు ఉచితంగా ప్రభుత్వం అమలు చేయగలదు . మూడు సంవత్సరాల తర్వాత ఎక్కడి నుంచి డబ్బు తీసుకు వస్తాం అన్న దృక్పథంతో ప్రభుత్వంపై రంగాలలో పెట్టుబడి పెట్టింది అనుకుంటే.. ప్రస్తుతం ఈ రంగాల అన్నీ కూడా కునారిల్లి ఈ రంగాలు చూపిస్తున్న నష్టాలు ఇలా ఉన్నాయి. ఫైనాన్స్, ‌రియల్‌ ఎస్టేట్‌, ‌ప్రొఫెషనల్‌ ‌స్పెక్టర్‌ ‌నష్టాలు ఒక లక్షా అరవై రెండు వేల కోట్లలు, హోటల్‌ ‌ట్రాన్స్పోర్ట్ ‌కమ్యూనికేషన్‌ ‌ట్రేడ్‌ ‌రంగాలలో నష్టాలు ఒక లక్షా అరవై ఒక వేల కోట్లు, మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌రంగంలో నష్టాలు ఎనభై ఆరు వేల నూట అరవై ఒక్క కోట్లు. కన్స్ట్రక్షన్‌ ‌రంగం నష్టం అరవై ఐదు వేల తొమ్మిది వందల పదమూడు కోట్లు, మైనింగ్‌ ‌రంగం నష్టం ఇరవై మూడు వేల నూట తొంభై నాలుగు కోట్లు.. ఈ రంగాలన్నీ కూడా నష్టాలను చూపుతూ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం ముందు మొర పెడుతున్నాయి..అంటే ప్రభుత్వం ఎందుకు పనికిరాని విధంగా ఈ రంగాలలో పెట్టుబడి పెట్టింది అన్నమాట. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే ఈ రంగాలను నడుపుతున్న అధిపతులు అంతా కూడా కోట్లకు పడగలె త్తి అత్యంత సంపన్నులుగా ఉన్నారు.

ఎంతసేపు కార్పొరేట్‌ ‌రంగం పైనే ఎందుకు విమర్శలు ..? రైతులకు రుణమాఫీ చేస్తున్నారు కదా.. రైతుల సంగతి కూడా ఆలోచించాలి అని అనుకుంటే.. రైతులకు సంబంధించి ప్రభుత్వ పెట్టుబడి ఏ విధంగా ఉందో ఒకసారి గమనిద్దాం. భారతదేశంలో విశాల భూభాగాలు ఉన్నప్పటికీ వ్యవసాయ యోగ్యమైన భూమి కేవలం 40% మాత్రమే. ఈ 40% భూమిపై ఆధారపడి జీవిస్తున్న జనసంఖ్య 10 కోట్ల 7 లక్షలు. ఈ జనాభా ప్రతి నెల ఆదాయం నాబార్డు చెబుతున్న లెక్కల ప్రకారం నెలకి 8931 రూపాయలు మాత్రమే. ఈ ఒక నెల ఆదాయాన్ని ఒక రైతు కుటుంబంలో ఐదుగురు సభ్యులు పంచుకోవాల్సి ఉంటుంది. ఈ రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం చేసిన రుణమాఫీ గత ఐదు సంవత్సరాలకు ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఆరు కోట్లు. ఈ మొత్తం 2014 -15 ఒక్క సంవత్సరానికి గానూ పారిశ్రామికవేత్తలకు చేసిన రుణ మాఫీ మొత్తం నలభై ఐదు వేల ఆరువందల యాభై ఎనిమిది కోట్లు కన్నా తక్కువ అనేది గమనించాలి. ఇక గత ఐదు సంవత్సరాలలో పారిశ్రామిక రంగానికి భారత ప్రభుత్వం చేసిన రుణమాఫీ అక్షరాల తొంభై నాలుగు వేల ఆరు వందల అరవై కోట్లు. వేల కోట్లుగా ఉన్న రైతాంగ జనాభాకు చేసిన రుణమాఫీ కొద్దిపాటి ధనవంతుల కోసం చేసిన రుణమాఫీ ఉన్న తేడా గమనించాలి మనం. ప్రభుత్వం పారిశ్రామికీకరణ పేరుతో ఎవరి పక్షాన ఉన్నదో గమనించాలి..

భారత ప్రభుత్వం లెక్కల పుస్తకాలలో కొద్దిపాటి పారిశ్రామికవేత్తల రంగమైన పారిశ్రామిక రంగం నుంచి వచ్చిన నష్టాలు.. నాన్‌ ‌పర్ఫార్మర్‌ అసెట్స్ ‌పేరుతో 19 లక్షల కోట్లు ఉంటే.. అసంఖ్యాకమైన రైతులు ఉన్న రైతాంగం రుణం రూపంలో ఇచ్చిన నష్టం 11 లక్షల కోట్లు.. అంటే స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశాన్ని వ్యవసాయ దేశం నుంచి పారిశ్రామిక దేశంగా మలచుతామని ప్రభుత్వాలు చేసిన బాసలు నీటి మీద రాతలుగా ఉన్నాయి.. స్వాతంత్రం వచ్చిన దగ్గరనుంచి భారత దేశాన్ని పాలించే అవకాశం దొరికిన అన్ని పార్టీలు కూడా భారతదేశాన్ని ధనిక..పేద దేశాలు చీల్చుతూ వచ్చాయి. కరోనా వైరస్‌ ‌యుగంలో ఈ చీలిక అగాథం అయి కూర్చున్నది. ఈ అగాధాన్ని పూడ్చడానికి.. చీలిక అగాధానికి ఆవల ఉన్న లాభాపేక్ష మనుషులకు వేతన జీవులను సమకూర్చటానికి.. ప్రస్తుత ప్రభుత్వాలు ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. అయితే ఈ ప్యాకేజీలు ధనిక పేదల మధ్య ఏర్పడిన అగాధాన్ని ఎంతమాత్రం పూడ్చలేవు.. ఇంత స్పష్టమైన సత్యాన్ని ఎలుగెత్తి చాటాడానికి ఎడమచేతి పార్టీల మని చెప్పుకుంటున్న వారు ఎందుకు సిద్ధంగా లేరో అర్థం కాదు.. దేశ ప్రజల దురదృష్టం కొద్దీ ఎడమచేతి పార్టీల మని చెప్పుకుంటున్న వారే ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ ‌చేయటం శోచనీయం.

Canada $ 2175 DollarsCoronavirus Kovid 19 For Families For US $ 6000European Union 1601France 782 DollarsGermany $ 7287 Britain 5943 DollarsJapan 2215 DollarsSouth Dollars 761Spain 4710 DollarsStatistics discrimination ..!
Comments (0)
Add Comment