అమరునికి పోరు సలామ్

ఉద్యమ ప్రతీక

అస్తిత్వ ప్రభవిక

ఆత్మగౌరవ పతాక

అతడే…

తెలంగాణ కధన భేరి

కాసోజు శ్రీకాంతాచారి

పౌరుషాల ఉగ్గు పట్టీ

ఉద్యమాల ఉపిరిలూది

పోరంటే త్యాగమని చాటినోడు

తరాల దాస్య విముక్తి కోసం

దోపిడీ పాలన అంతం కోసం

మహాపోరు సాగించిన ధీరుడు

వలసపాలకుల దాష్టికాలపై

ధిక్కార స్వరమెత్తిన విప్లవుడు

తెలంగాణ సాధన కోసం

చావును ముద్దాడిన యోధుడు

భగభగ మండే మంటలు

దేహాన్నీ దహించివేస్తున్నా

జై తెలంగాణ నినాదం వీడని

మలి దశ తొలి అమర వీరుడు

తెలంగాణ సాధన కోసం

చావును హత్తుకున్న అమరుడు

చాకలి ఐలమ్మ దీరత్వం

కొమురం భీమ్ అమరత్వం

వీరుల త్యాగత్వం తన సొంతం

తెలంగాణ విజయభేరి

కాసోజు శ్రీకాంతాచారి

నీ త్యాగం వృదాకాలేదు

మరువదు తెలంగాణ గడ్డ

నీకివే మా నిరాజనాలు

అరుణారుణ సలాములు

(డిసెంబర్ 3 న శ్రీకాంతాచారి వర్దంతి

సందర్బంగా….)

కోడిగూటి తిరుపతి

Mbl no :9573929493

srikanta charySrikanthachari Vardhanti
Comments (0)
Add Comment