వేములవాడలో వైభవంగా శ్రీ శివకల్యాణం

రాష్ట్ర ప్రభుత్వం విధించిన కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామిల కల్యాణం బుధవారం  ఉదయం  అత్యంత వైభవంగా అంతరంగికంగా  నిర్వహించారు. అన్ని శైవాలయాల్లో శ్రీ శివకల్యాణాన్ని మహాశివరాత్రి నాడు నిర్వహిస్తుండగా శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం కామ దహనానంతరం(హోళీ పండుగ) అనంతరం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న గుడిలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామిల కల్యాణాన్ని నిర్వహించగా వేలాది శివపార్వతులు, జోగినులు, వందలాది హిజ్రాలు పాల్గొన్నారు  ఉదయం శ్రీస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన పిదప శ్రీ స్వామివారి కల్యాణ మండపంలో కల్యాణ తంతును నిర్వహించగా కన్యాదాతలుగా గోపన్నగారి వసంత్‌కుమార్‌, ‌సరిత  దంపతులు వ్యహరించారు. స్థానాచార్య అప్పాల భీమాశంకర్‌ ‌శర్మ, వేదపండితులు శరత్‌ ‌చంద్ర, రాజేశ్వర శర్మ తదితరుల అధ్యర్యంలో ఉదయం 10  గంటల నుండి కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించడానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం పూర్తిగా నిండిపోగా రోడ్డుపై వందలాద మంది భక్తులు వేచి ఉన్నారు.

కోవిడ్‌ ‌నిబంధనలకు అనువుగా భక్తులెవరిని ఆలయంలోకి అనుమతించకుండా కేవలం దేవస్థానం సిబ్బంది మాత్రమే ఈ తంతును నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ మున్సిపాలిటి తరపునచైర్‌ ‌పర్సన్‌ ‌రామతీర్ధపు మాధవి, కౌన్సిలర్లు, కమిషనర్‌లు సమర్పించారు.

Comments (0)
Add Comment