సహజీవనం చేస్తూనే.. అప్రమత్తంగా ఉండాలి

  • శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌ ‌హెచ్చరిక
  • థర్డ్‌వేవ్‌ ‌భయాలతో ప్రజల్లో మళ్లీ ఆందోళన

భారత్‌లో కొరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ‌సౌమ్యా స్వామినాథన్‌ ఊహకందని హెచ్చరిక జారీ చేశారు. భారత్‌లో కోవిడ్‌-19 ‌మహమ్మారి స్థానికత స్థాయికి చేరిందన్నారు. ఫలితంగా ఇది స్వల్పంగా లేదా మధ్యస్థంగా వ్యాప్తి చెందుతుంటుందన్నారు.

ఇటువంటి పరిస్థితిలో జనం ఈ వైరస్‌తో సహజీవనం చేస్తూ, అప్రమత్తంగా ఉండాలన్నారు.కొరోనా నుంచి ఉపశమనం లభించాలంటే దీర్ఘకాలం పడుతుంద న్నారు. దేశంలోని ప్రజల అలవాట్ల కారణంగా వారి రోగ నిరోధక శక్తి పలువిధాలుగా ఉంటుందని, ఇది కొరోనా స్థానికత స్థాయికి కారణం కావచ్చన్నారు. 2022 చివరి నాటికి వ్యాక్సినేషన్‌ ‌లక్ష్యం పూర్తయితే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముందన్నారు.

leading scientistprajatantra newstelugu vaarthalutoday breaking updatesWorld Health Organization
Comments (0)
Add Comment