రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 336 మందికి పాజిటివ్‌.. ఒక్కరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 336 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 306 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా ఒక్కరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 96 కేసులు నమోదవగా, రంగారెడ్డి, వరంగల్‌ ‌జిల్లాలలో 24 కేసులు, నల్లగొండ జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,62,202 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,898కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,53,022 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 5,282గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

breaking newscrime todayIncreased New Corona Casesprajatantra epaperread news onlinetelugu articlestelugu vaarthalu
Comments (0)
Add Comment