నిండుకుండలా శ్రీరాం సాగర్‌ ‌ప్రాజెక్ట్

ఎగువ ప్రాంతాల నుంచి వొస్తున్న వరదతో నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరామ్‌ ‌సాగర్‌ ‌ప్రాజెక్టులోకి భారీగా నీరు వొచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి 1,83,883 క్యూసెక్కుల నీరు వొస్తున్నది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1082.70 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రస్తుతం 60 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జిల్లాలోని రెంజల్‌ ‌మండలం కందకుర్తి వద్ద గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం దాలుస్తున్నది. గోదావరి పరవళ్లు తొక్కుతుండటంతో.. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం పెరిగింది. గోదావరి నదిలో గల పురాతన శివాలయం నీట మునిగిపోయింది. మరోవైపు కడెం ప్రాజెక్టుకు కూడా 18,892 క్యూసెక్కుల ఇన్‌ ‌ప్లో ఉండటంతో 17,226 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఇన్‌ప్లో నమోదవుతోంది.

కడెంతోపాటు సమిపంలోని వాగులు, కుంటల ద్వారా నాలుగు రోజులుగా నిరంతరాయంగా వరదనీరు వస్తుండడంతో బుధవారం సాయంత్రం 24,408 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. మొత్తంగా 20.175 టీఎంసీల పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లిలో 19.4530 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 16,686 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి నుంచి గోదావరికి వెళుతోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లోకి ఈ ఏడాది వేసవిలో ఇప్పటికే నీటిని ఎత్తిపోయడంతో.. ఇప్పుడు ఆ నీటినంతా తిరిగి గోదావరిలోకి వదలాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.

headlines todayHeavy Water Inflowprajatantra newsShriram ‌Sagar‌ projecttelugu short newstelugu stories
Comments (0)
Add Comment