‘ఆ ‌తీర్మానంపై చర్యలు తీసుకోండి’

  • టిఆర్‌ఎస్‌, ‌కేసీఆర్‌కు వోట్లంటూ తీర్మానం చేసిన శిలాజీనగర్‌ ‌సర్పంచ్‌
  • ‌జిపి తీర్మానం అప్రజాస్వామికం…ఈ తీర్మానంపై చర్యలు తీసుకోవాలంటూ సిఈవోకు లేఖ రాసిన పొన్నం

కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ ‌కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారికి(సిఈవో)లేఖ రాశాడు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను పొన్నం మీడియాకు విడుదల చేశాడు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనీ, తప్పుడు హామీలతో దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవాలని చూస్తుందన్నారు. దుబ్బాక(41)కు త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి, కేసీఆర్‌కు వోట్లు వేస్తామంటూ దుబ్బాక నియోజకవర్గంలోని శిలాజీనగర్‌ ‌గ్రామ పంచాయతీ తరపున సర్పంచి తీర్మానం చేసినట్లు లిఖితపూర్వకంగా రాసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు తీర్మాన కాపీని అందజేయడమంటే నిబంధనలను ఉల్లంఘించడమేననీ అన్నారు.

ఎన్నికలలో ఫలాన పార్టీకి, ఫలాన అభ్యర్థికి వోట్లు వేస్తామంటూ తీర్మానం చేయడం, లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌ ‌కోరారు. ఏకగ్రీవ తీర్మానలంటూ అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, పూర్తి అప్రస్వామికమని పొన్నం ఆరోపించారు.  కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుతో పాటు శిలాజీనగర్‌ ‌గ్రామపంచాయతీ సర్పంచి సంతకంతో కూడిన తీర్మాన కాపీని పంపిన లేఖను రాష్ట్ర ఎన్నికల అధికారి, సిద్ధిపేట కలెక్టర్‌, ‌సిద్ధిపేట పోలీస్‌ ‌కమిషనర్‌, ‌దుబ్బాక సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌కు •డా పొన్నం పంపించారు. ఇదిలా ఉంటే, దుబ్బాక సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.

Chief Electoral Officer (CEO)Congress' Party Working‌ Presidentformer MP Ponnam PrabhakarkcrShilajinagar Sarpanch decides to vote for TRS
Comments (0)
Add Comment