శంకరాచార్య విగ్రహ పునఃప్రతిష్ట పవిత్ర కార్యక్రమం

  • రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలి
  • రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌

ఇప్పటికీ అనేక ఆలయాల్లో దూప దీప నైవేద్యాలు జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. శుక్రవారం ఆయన విద్యానగర్‌ ‌శంకర్‌మఠాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా వి•డియాతో మాట్లాడుతూ కేదార్‌నాథ్‌ ‌వరద బీభత్సంలో ఆదిశంకరాచార్యుల విగ్రహం కొట్టుకుపోయిందని, తిరిగి ప్రధాని మోదీ విగ్రాహాన్ని పునఃప్రతిష్టించి..పూజా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. గతంలో తాను హిందూ అని చెప్పుకునే పరిస్థితులు లేవన్నారు. మోదీయే లేకుంటే ఈ పవిత్ర కార్యం జరిగేదా అని అన్నారు. అయోధ్య రామ మందిరం, 370 ఆర్టికల్‌ ‌రద్దు జరిగేదా?…దీన్ని కూడా మత కోణంలో చూడడం మూర్ఖత్వమన్నారు.

80 శాతం హిందువులు ఉన్న దేశంలో ధర్మం కోసం పని చేస్తే మతతత్వం అనడం దుర్మార్గమని బండి సంజయ్‌ అన్నారు. ఇదిలావుంటే ఈ నెల 9న రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీజేపీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని కమలనాథులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. నవంబర్‌ 4 ‌తర్వాత దళితబంధును ఎవరూ ఆపలేరని టీఆర్‌ఎస్‌ ‌ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ ‌తన మాటను నిలబెట్టుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్‌ ‌చేశారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వం దళితబంధును అమలు చేసే వరకు పోరాటం చేస్తామని కమలనాథులు స్పష్టం చేశారు. 9న దళితబంధు ఆందోళనలు, 12న నిరుద్యోగ మిలియన్‌ ‌మార్చ్‌తో ప్రజల్లోకి వెళ్ళాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది.

prajatantra newsTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updates
Comments (0)
Add Comment