నదిజలాల వాటాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో 10 జిల్లాల తెలంగాణ ప్రాంతానికి నీళ్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి నీళ్ల సమస్య ఒక ప్రధాన భూమిక పోషించిన విషయం తెలిసిందే,ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ‌మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి పాలన స్వతంత్రంగా సాగుతున్న కానీ ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి రావలసిన వాటాను ఉపయోగించుకోవడం లేదు ఇప్పటికీ కూడా కృష్ణనది నీళ్ల విషయంలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది దానికి ప్రధాన కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ,‌తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం అన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీసుకునే తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు అనేది కాంట్రాక్టర్ల కోసమో,లేక కమీషన్ల కోసమో కకృతి పడి తెలంగాణ సమాజాని ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వంతో తాకట్టు పెట్టడంతో తెలంగాణ భవిష్యత్‌ ‌ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో కృష్ణానది నీటిని దోచుక పోవడానికి నాటి అంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి పోతిరెడ్డిపాడును తవ్వి తెలంగాణ ప్రాంతానికి నీళ్ల సమస్యను ఏ విధంగా సృష్టించారో ఇప్పుడు అతని కుమారుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైయస్‌ ‌జగన్‌ ‌కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రాంతంలో అనుమతులు లేకుండా కూడా సంగమేశ్వర,రాయలసీమ ఎత్తిపోతల పథకాలను నిర్మించడం అంటే అది ముమ్మాటికి తెలంగాణ ప్రాంతానికి కృష్ణనది నీళ్ల విషయంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ద్రోహం చేస్తున్నట్లే అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు,వైయస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి పోతిరెడ్డిపాడుతో అన్యాయం చేస్తే ఇప్పుడు అతని కుమారుడు వైయస్‌ ‌జగన్మోహాన్‌ ‌రెడ్డి సంగమేశ్వర దేవాలయం నుంచి కృష్ణ నీటిని తరలించి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తెలంగాణకు మరింత అన్యాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం రెడీ అయింది.

ఇంత అన్యాయం జరుగుతున్నా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఈ కృష్ణ నది నీళ్ల విషయంలో శాశ్వత పరిష్కార మార్గాలు ఎంచుకోకపోవడం తెలంగాణ రాష్ట్రానికి,మరి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌,‌దక్షిణ తెలంగాణ ప్రాంతానికి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పక తప్పదు, రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల విషయంలో పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు కృష్ణ నది యాజమాన్య బోర్డు అనేక సందర్భాలలో సమావేశాలు ఏర్పాటు చేసిన కూడా ఆ సమావేశాలకు సరిగ్గా హాజరు కాకపోవడంతో తెలంగాణకు నది జలాల విషయంలో ఎంత మేరకు అన్యాయం జరుగుతుంది అని వివరించి లేకపోతున్నారు ఇదే అనువుగా చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా కృష్ణ నది నీటిని దోచుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం పని చేస్తుంది,ఇంకా చెప్పాలంటే రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు,ఇబ్బందులు ఉంటే వాటిని చెప్పుకుని పరిష్కారం దిశగా అడుగులు వేసేటువంటి అఫ్ఫెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశానికి హాజరు కాకపోవడం వల్లన తెలంగాణ ప్రాంతానికి ఏ మేరకు ఇబ్బంది తలెత్తుతుంది ,దానిని ఏ విధంగా పరిష్కరించాలి అనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి లేనప్పుడు కృష్ణ యాజమాన్య బోర్డ్ ఈ ‌సమస్యను ఎలా పరిష్కరిస్తుంది! అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశానికి హాజరైతే ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం నిర్మించే అక్రమ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసి వాటిని ఆపే అధికారం,ప్రశ్నించే అధికారం ఈ అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశంలో ఉంటుంది అస్సలు తెలంగాణ ప్రభుత్వం ఈ అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశానికి హాజరు కానప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల వాటా విషయంలో ఏ విధంగా న్యాయం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ ‌లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులకు కృష్ణ నది యాజమాన్య బోర్డ్ అనుమతి అనేది రాయలసీమ ప్రాంతానికి తాగునీటి తో పాటు,సాగు నీటికి అనుమతి ఇచ్చిందే వేల టీఎమ్‌ ‌సీ ల నీళ్లు సముద్రపాలు కాకుండా,వృధా చేయకుండా ఆ నీటిని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ఆ ప్రాజెక్టులకు కృష్ణ యాజమాన్య బోర్డు,కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇచ్చింది, అలాంటప్పుడు వరద వచ్చే సమయంలో వేల టీఎమ్‌ ‌సీల నీళ్లు,లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలు కాకుండా వాటిని కాపాడుకోవడం కోసం మాత్రమే, కానీ ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఆ విషయాలన్నిటినీ మర్చిపోయి మరోసారి దక్షిణ తెలంగాణ ప్రాంతానికి ఘోర అన్యాయం చేస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన వాటా కూడా అంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం ఉపయోగించుకుంటుంది ఇది అన్యాయం,అక్రమం కూడా.

ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వై యస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి తీసుకునే నిర్ణయాలు,తెలంగాణ ప్రభుత్వ వైఫల్యల వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది ఈ ప్రమాదం నుంచి త్వరగా బయట పడాలంటే ఖచ్చితంగా కృష్ణ జలాలను కాపాడే విధంగా,కృష్ణ జలాలను పరిరక్షించే విధంగా తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలి అప్పుడే తెలంగాణ ప్రాంతానికి కృష్ణ నది విషయంలో న్యాయం జరుగుతుంది లేకపోతే ఈ ప్రభుత్వం చేసే వైఫల్యాల కారణంగా తరతరాలుగా ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది.ఈ పరిణామాలన్నింటినీ చాలా నిశితంగా పరిశీలిస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం,కేసీఆర్‌ ‌చేతకానితనాన్ని చూసి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కృష్ణానది నీళ్ల సమస్యను పరిష్కారించేందుకు సిద్ధం అయింది.

కృష్ణ నది నీళ్ల వాటా విషయంలో 555 •ఎ•ల నీళ్లు తెలంగాణ ప్రాంతానికి రావాలి కానీ కేసీఆర్‌ ‌మాత్రం కేవలం 299 టీఎమ్‌ ‌సీల కు మాత్రమే అంగీకరించి తెలంగాణ రాష్ట్రానికి 256 టీఎమ్‌ ‌సీల నీళ్ళను తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేశారు ,అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్విభజన చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా యాజమాన్య బోర్డు ప్రకటించిన నీటి వాటా కంటే దాదాపు 140 నుంచి 150 టీఎమ్‌ ‌సీల వరకు ఆంధ్రప్రదేశ్‌ అదనంగా వాడుకుంటుంది,ఇంత అన్యాయం,దారుణం జరుగుతున్న కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ,‌తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం చర్య తీసుకోక పోవడం చాలా దురదృష్టకరం.

– గిరి వర్ధన్‌ ‌రెడ్డి,
బిజెపి మేడ్చల్‌ ‌జిల్లా ప్రధాన కార్యదర్శి

prajatantra newsSerious injusticetelanganaTelugu News Headlines Breaking News NowToday Hilightswater sharesతెలుగు వార్తలు
Comments (0)
Add Comment