సెల్ఫ్ ‌చెక్‌ ‌కియోస్క్ ‌యంత్రం

కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి..

పని తీరు అద్భుతం: ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 

‌బి ఆర్‌ ‌కే భవన్‌ ‌లో సెల్ఫ్ ‌చెక్‌ ‌కియోస్క్ ‌ను ఆవిష్కరించిన మంత్రులు ఈటల మరియు కొప్పుల. ప్రపంచం మొత్తాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి  ‘‘వర్క్ ‌స్పేస్‌ ‌మెటల్‌ ‌సొల్యూషన్స్’’  ‌సంస్థ సంక్షేమ శాఖకు బహూకరించిన సెల్ఫ్ ‌చెక్‌ ‌కియోస్క్ ‌యంత్రాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌మరియు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మంత్రులకు ఈ యంత్రం యొక్క పనితీరును వివరించారు.ఈ యంత్రం ముందు మనిషి నిలబడగానే సంబంధిత వ్యక్తి యొక్క ఫొటో,శరీర ఉష్ణోగ్రత మరియు రక్తంలోని ప్రాణవాయువు(ఆక్సిజన్‌) ‌శాతాన్ని వెంటనే లెక్కకట్టి స్క్రీన్‌ ‌పై చూపిస్తుంది.  చేతులు శుభ్రపరచడానికి శానిటైజర్‌ ‌వస్తుంది. తర్వాత మన మొబైల్‌ ‌ఫోను, తాళాలు ఫైల్స్, ఆఫీస్‌ ‌బ్యాగ్‌, ‌లాంటివి యువి బాక్స్‌లో ఉంచడం ద్వారా వాటన్నింటిని వైరస్‌ ‌రహితంగా చేస్తుంది.

ఈ ప్రక్రియ అంతా అరనిమిషంలో పూర్తవుతుంది.ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ ఈ యంత్రం పని తీరు అద్భుతమని కొనియాడారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ స్వీయ  నియంత్రణ పాటిస్తూ అత్యవసరమైనప్పడు మాత్రమే బయటకు రావాలని సూచించారు. మాస్కులు తప్పకుండా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.తెలంగాణ రాష్ట్రంలో వైరస్‌ ‌బారీన పడి కోలుకున్న వారి సంఖ్య (రికవరీ రేటు) ఎక్కువగా ఉందని, మరణాల రేటు జాతీయ సగటుకన్నా తక్కువగా ఉందని అన్నారు.సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌  ‌మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన యంత్రం అని దీనిని  అన్ని కార్యాలయాలలో బస్‌ ‌స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో, ఆసుపత్రులవద్ద, జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉంచడం ద్వారా వైరస్‌ ‌వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్‌ ‌కుమార్‌, ‌టీఎన్జీవో అధ్యక్షులు కారం రవీందర్‌ ‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ ‌లు పాల్గొన్నారు.

Health Minister etea Rajender‌minister etela inaugurateSelf ‌check kiosk machine
Comments (0)
Add Comment