సంక్రాంతి మేలా

సరదాల వేదిక

సరసాల వీచిక

సమైక్యతల గీతిక

సంస్కృతుల ప్రతీక

ఈ రంగవల్లుల వేడుక

 

 

తరాల సంప్రదాయం

ఆధ్యాత్మిక సంతోషం

వ్యవసాయ సౌభాగ్యం

శ్రమైక జీవన సౌందర్యం

మార్పుకు సిసలు సాక్ష్యం

సంక్రాంతి పర్వదినోత్సవం

 

 

భోగి మంటల తాపాలు

రంగవల్లుల సోయగాలు

గొబ్బెమ్మల తబ్బిబ్బులు

గాదెల నిండా ధాన్యాలు

చిన్నారుల ఆట పాటలు

ముత్తైదువల భక్తి పూజలు

బావమరదల్ల సరసాలాటతో

లోగిళ్ళు సంబరాల పందిళ్లు

 

 

హరిదాసు భక్తిరస కీర్తనలు

బసవన్న సన్నాయి రాగాలు

గంగిరెద్దుల గణగణ గంటలు

గాలి పటాల గగన విహారాలు

కోడి పందాల పౌరుష హాసాలు

కోలాటాలు చిత్రవేషాధారణతో

సంబరాలు అంబరాన్ని తాకేను

 

 

కొరోనా కమ్మిన కష్ట కాలంలో

గృహాన్ని వేదికగా తలపోస్తూ

నిబంధనలు నిష్ఠగా పాటిస్తూ

సంక్రాంతి పర్వదినోత్సవాన్ని

ఉల్లాసభరితంగా జరుపుదాం

 

తెలుగు సంస్కృతి ప్రాశస్త్యం

జగతిలో ఎలుగెత్తి చాటుదాం

(సంక్రాంతి పర్వదిన శుభాకా ంక్షలతో..)

– కోడిగూటి తిరుపతి, 9573929493

Comments (0)
Add Comment