సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత సుబ్బారావు అరెస్ట్

‌విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం సుబ్బారావును గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల తర్వాత ఆయనను బోయిగూడ రైల్వే కోర్టులో హాజరు పరచనున్నారు. మేడిపల్లిలోని సాయి డిఫెన్స్ అకాడమీకి కూడా రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైల్వే యాక్ట్ 1989 ‌కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణకు హాజరు కావాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. సాయి డిఫెన్స్ అకాడమీ రికార్డులతో పాటు అన్ని పత్రాలను ఆర్పీఎఫ్‌ ‌కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించారు.

ఆర్మీ ఉద్యోగార్థులను సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. సికింద్రాబాద్‌ ‌విధ్వంసం కేసు విషయంలో రైల్వే పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు.తాజాగా సాయి డిఫెన్స్ అకాడమీకి రైల్వే పోలీసుల నోటీసులు జారీ చేశారు.రైల్వే యాక్ట్ 1989 ‌కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆర్పీఎఫ్‌ ‌కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన రికార్డులు,ఆధారాల పత్రాలతో కార్యాలయానికి హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.

Sai Defense Academy headSai Defense Academy head Subbarao arrestedSubbarao arrested
Comments (0)
Add Comment