‘‘ ‌రైతు పాట ’’

పల్లవి : మోగిస్తుండూ -సమర భేరి
పూరిస్తుండూ – శంఖా రావం
ఈ మట్టి మనిషి – ఈ రైతు బిడ్డ
తర తరలుగా నమ్ముకున్న
ఈ భూమి కోసం ఈ భుక్తి కోసం   ।।మో।।

చరణం : కదలాలిరా.. కదలాలిరా
శాంతి సైనికుడివై.. కదలాలిరా
పంట చేల ముద్దుబిడ్డవై.. కదలాలిరా
నోటికాడికి బువ్వ నందిస్తూ…
ఆకలి కేకలతో. అలమటిస్తుంటావు..
ఈ దేశం నవ్వుల కోసం.. నీ నవ్వులు
దాచిపెట్టి.. రాని చిరునవ్వులను
పెదవులపై పూసుకొని..
తలపాగా చుట్టుకొని.. మీసాలను
మెలివేస్తావు..
ధవాళ వస్త్రధారివై.. రైతే రాజంటావు
నీ నడకల ఆనందం -పురివిప్పి ఆడుతుంటే
పులకరించిపోతుందీ ఈ పుడమి తల్లీరా  ।।మో।।

చరణం : పొద్దేమో పొడవనంది.. నీవు లేవని
మొలకేమో మొలవనంది.. నీ అడుగుల సవ్వడిలేక
మట్టిలోని అణువణువు.. నీ రాక కోసం
తల్లడిల్లిపోతుందీ..
నీవు ముద్దేట్టుకుంటే..।।నీవు।।
బంగారమే పండును
ఈ నేల తల్లి ఒడిలోన
తొలకరి నిన్ను చూసి- మురిసిపోతానన్నది
వానేమో.. నిను తాకి-ఊరకలేస్తా నంటది..
అడవేమో.. నీ తలపులతో
బతుకేస్తానంటూ.. నీ హక్కుల ఉద్యమాల
ఊపిరావుతానంటున్నది..
కాలిగజ్జె – చేతి డప్పు
పాటల ఊటలతో.. అక్షర తూటాలై
పేలుతానంటున్నవి..
పల్లె పట్నం నగరం ఏకమై
నీ వెన్నెంటే వుంటామని
చెయ్యి చెయ్యి కలుపుతున్నవి..
రైతన్న గుండె గోస..
గాయాల గత చరిత మార్ఛ..
కవుల కలాలు
కవత్తు చేస్తామంటున్నవి..।।మోగిస్తుండూ।।
– రవీందర్‌ ‌కొండ, 9848408612

Comments (0)
Add Comment