మే 20 నుండి జూన్ 5వ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు

ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరిగింది. మే నెల 20వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించే ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1658 కోట్లు మంజూరు చేసింది. 10 టిఎంసీల గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఈ పథకానికి వినియోగించనున్నారు.
పార్వతీ బ్యారేజ్ జలాశయం నుంచి జైపూర్, మందమర్రి మండలాల్లో 25,423 ఎకరాలకు, సరస్వతి బ్యారేజ్ జలాశయం నుంచి చెన్నూరు, భీమారం, కోటపల్లి మండలాల్లో 48,208 ఎకరాలకు, లక్ష్మీబారేజీ జలాశయం నుంచి కోటపల్లి మండలంలో 16,370 ఎకరాలకు మొత్తంగా 90,000 ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందనున్నది.
Comments (0)
Add Comment