పౌర సమాజమా.. మేలుకో !

నిర్భయ, దిశ లాంటి
చట్టాలెన్ని రూపొందించినా…
కలి కీచక అకృత్యాలు ఆగలేదు

జీవిత ఖైదు ఉరి లాంటి
కఠిన శిక్షలేన్ని విధించినా
కామ పిశాచి పీడ విరగడవలేదు

థర్డ్ ‌డిగ్రీ ,ఎంకౌంటర్‌ ‌లాంటి
తీవ్ర ప్రయోగాలెన్ని చేసినా
మృగాళ్ల ఆగడాలు ఆగలేదు

ప్రభుత్వాలెన్ని మారినా
విష సంస్కృతి కడతెరలేదు
ఇంకా హెచ్చుమీరు తరుణం

పశు వాంఛ తీర్చుకోన
పసి మొగ్గ మొదలుకొని
చావుకు చేరువైన వృద్ధను
వదలక చెరబట్టే కీచకత్వం

ఆడ మాంస ముద్దయితే
చాలనే పైశాచికత్వం వెరసి
పూటకో అఘాయిత్యం
గడియకో అత్యాచారం
నిత్య తంతుగా మారింది

ఈ వ్యవస్థలో…
అతివ బతుకు తీరు
గడియ గడియ గండం
గడప దాటితే అగ్నిగుండం

ఈ కుసంస్కృతి స్థిరమైతే
అమ్మతనం అంధకారం
మానవత్వం మటు మాయం
మనిషి అస్తిత్వం శిథిలశకలం

ఇప్పటికైనా…
సమాజం బాధ్యతగా స్పందిస్తే…
విష బీజాన్ని ఆదిలోనే తుంచేస్తేనే
స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ సంప్రాప్తిస్తుంది

(సైదాబాద్‌ ‌చిన్నారి అత్యాచార ఘటనకు స్పందనగా….)
– కోడిగూటి తిరుపతి, 9573929493
prajatantra newsrip societyTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updates
Comments (0)
Add Comment