PCC President Revanth Reddy: రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ ‌రెడ్డి

  • అధికారికంగా ప్రకటించిన ఏఐసిసి
  • ఐదుగురు వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్ల నియామకం
  • పలువురు సీనియర్లకు పార్టీ పదవులు

సుధీర్ఘ కాలం పెండింగ్‌లో ఉంచిన రాష్ట్ర పిపిసి అధ్యక్షుడి పదవిని ఎట్టకేలకు కాంగ్రెస్‌ అధిష్టానం శనివారం రాత్రి ప్రకటించింది. మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి ఎంపి కేవంత్‌ ‌రెడ్డిని నియమిస్తూ ఏఐసిసి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో వర్గ విభేదాలతో ఏకాభిప్రాయం కుదరక రాష్ట్ర అధ్యక్షుడి నియామకం చాలా కాలంగా వాయిదా పడుతూ వొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో క్రాగెస్‌ అధిష్టానం నిస్సహాయతపై ప్రతిపక్షాల నుండి పలు విమర్శలు ఎదుర్కున్నది. ఏమైతేనేమి చివరకు నియామక పక్రియను పూర్తి చేసింది. చివరి నిముషం వరకూ భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌ ‌రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపించినా చివరకు ప్రస్తుతం వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌ ‌రెడ్డినే అధిష్టానం పిసిసి అధ్యక్షుడిగా ఖరారు చేసింది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎదురులేకుండా ఉన్న కెసిఆర్‌ను ఢీ కొట్టగల సామర్థ్యం ఉందని భావించే రేవంత్‌ ‌రెడ్డికి రాష్ట్ర సారథ్య బాధ్యతలను అప్పగించి ఉండవొచ్చు. ఇక పిసిసి అధ్యక్షడితో పాటు ఐదుగురు వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌లను, పది మంది ఉపాధ్యక్షులను, ప్రచార కమిటీ చైర్మన్‌ను కూడా నియమించింది. వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్‌, ‌గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ ‌యాదవ్‌, ‌జగ్గారెడ్డి, మహేశ్‌ ‌కుమార్‌గౌడ్‌లను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీని నియమించింది. ప్రచారకమిటీ కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వర్‌ ‌రెడ్డి నియమితులయ్యారు.

సీనియర్‌ ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్‌, ‌దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేష్‌ ‌షెట్కార్‌, ‌వేం నరేందర్‌రెడ్డి, రమేష్‌ ‌ముదిరాజ్‌, ‌గోపీశెట్టి నిరంజన్‌, ‌టి.కుమార్‌రావు, జావెద్‌ అవి•ర్‌లను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సారంథంలోని రాష్ట్ర కమిటీ సేవలను ప్రశంసిస్తూ పార్టీ ఒక ప్రకటనను విడుదల చేసింది.

Rewanth Reddy pccstate PPC presidentTelangana New PCC
Comments (0)
Add Comment