మరణించిన రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా

ప్రతిజ్ఞా ర్యాలీలో మోడీని ఎండగట్టిన ప్రియాంక
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా చేపట్టిన నిరసనలో మరణించిన రైతులకు ప్రధాని మోదీ గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మొరాదాబాద్‌లో గురువారం నిర్వహించిన ప్రతిజ్ఞా ర్యాలీలో ఆమె ప్రసంగించారు. అభివృద్ధి ప్రాతిపదికన కాంగ్రెస్‌ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హావి• ఇచ్చారు. ప్రతి జిల్లాలో తయారీ హబ్‌ ‌తెరుస్తామన్నారు.

చెరుకు రైతుల బకాయిలన్నింటిని క్లియర్‌ ‌చేయడానికి రూ. 4,000 కోట్లు సరిపోతాయని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రధాని మోదీ గత ఏడాది కొరోనా సమయంలో రూ.8,000 కోట్లతో ప్రైవేట్‌ ‌విమానాలు కొనుగోలు చేశారని విమర్శించారు. పార్లమెంట్‌ ‌సుందరీకరణకు కేంద్రం రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తున్నదని, కానీ చెరుకు రైతుల బకాయిలు తీర్చడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ ఆమె మండిపడ్డారు.

Congress General Secretary Priyanka GandhiHeadlines Breaking News Nowprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment