లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ఆర్‌బిఐ కీలక ప్రకటన.. ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం

  • రివర్స్ ‌రెపోరేటు 90 బేసిస్‌ ‌పాయింట్లు
  • రెపోరేటు 75 బేసిస్‌ ‌పాయింట్లు తగ్గింపు
  • బ్యాంకుల షేర్లపై స్టాక్‌ ‌మార్కెట్ల  ప్రకంపనలు
  • ఆర్థిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటున్నాం
  • ప్రకటించిన ఆర్‌బిఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌

‌ముంబై,మార్చి 27: ‌ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌తెలిపారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో.. ప్రపంచదేశాల ఆర్థికస్థితి సరిగా లేదన్నారు. అయినా భారతీయ బ్యాంకింగ్‌ ‌వ్యవస్థ సురక్షితంగా, బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ అన్నారు. శుక్రవారం ఆయన డియాతో మాట్లాడుతూ మునుముందు చాలా గడ్డు రోజులు ఉన్నాయని, కాగా అవి ఎక్కవ రోజులు ఉండవన్నారు. కానీ కఠినమైన వ్యవస్థలు మాత్రం ఆ గడ్డు పరిస్థితుల నుంచి గ్టటెక్కుతాయని ఆయన తెలిపారు.కరోనా ప్రభావంతో భారత రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కీలక ప్రకటన చేసింది. రివర్స్ ‌రెపోరేటు 90 బేసిస్‌ ‌పాయింట్లు, రెపోరేటు 75 బేసిస్‌ ‌పాయింట్లు తగ్గించడంతో రెపోరేటు 4.4 శాతానికి తగ్గిందని ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌తెలిపారు. ఆర్థిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు.  ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన ఆయన… అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటామని తెలిపారు.

అటు సరైన సమయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహకరిద్దామన్నారు శక్తికాంతదాస్‌. ‌మార్కెట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు.  ఇటీవల స్టాక్‌ ‌మార్కెట్లలో వచ్చిన ప్రకంపనలు బ్యాంకుల షేర్లపై పడినట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ ‌నేపథ్యంలో మార్కెట్లు డీలాపడ్డాయన్నారు. దీంతో కొందరు డిపాజిటర్లు బ్యాంకుల నుంచి డబ్బును డ్రా చేసుకున్నట్లు ఆయన చెప్పారు. డిపాజిట్ల భద్రతను షేర్లతో పోల్చలేమన్నారు. కమర్షియల్‌ ‌బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల డిపాజిటర్లు ఆందోళన చెందవలసిన అవసరం లేదని దాస్‌ అన్నారు. డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉన్నట్లు తెలిపారు. ప్రాంతీయ బ్యాంకులతో పాటు అన్ని కమర్షియల్‌ ‌బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు .. ఈఎంఐలపై మూడు నెలల మారిటోయం పాటించనున్నట్లు చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌తో భారతీయ ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌మార్కెట్లు కొంద వత్తిడికి లోనైట్లు చెప్పారు. ఆర్థిక మందగమనం, కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయాలు ప్రకటించారు.  రుణ చెల్లింపుదారులకు ఆర్బీఐ గవర్నర్‌ ‌శుభవార్త చెప్పారు. వచ్చే మూడు నెలలు  ఇఎంఐ చెల్లించకపోయిన పర్వాలేదని తెలిపారు. బ్యాంకులతో పాటు అన్ని ఫైనాన్స్ ‌సంస్థలు అన్ని రకాల లోన్‌లపై మూడు నెలల పాటు వాయిదా వేయాలని శక్తికాంతదాస్‌ ‌సూచించారు. హౌసింగ్‌లోన్లతో పాటు అన్ని రకాల రుణాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు చెల్లించాల్సిన ఇఎంఐలు తర్వాత పీరియడ్‌లో ఎప్పుడైనా  చెల్లించవచ్చన్నారు.

ఇఎంఐలు కట్టకపోయిన సిబిల్‌ ‌స్కోర్‌పై   ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఒకవేళ కోవిడ్‌19 ‌కేసులు ఇలాగే పెరిగితే, అప్పుడు పరిస్థితి ఆందోళనకంగా ఉంటుందన్నారు.  సప్లై చైయిన్‌ ‌దెబ్బతింటుందని, దాని వల్ల భారత వృద్ధి కుంటుపడుతుందన్నారు. అయితే అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గడం వల్ల ఇది మన దేశానికి దోహదపడే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఏర్పడినట్లు గుర్తించామన్నారు.  కరోనా వైరస్‌ ‌లాక్‌డౌన్‌తో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.  సోషల్‌ ‌డిస్టాన్సింగ్‌ ‌లాంటి నియమాల వల్ల కూడా పరిస్థితి భయానకంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటుందన్న ఆశలను కూడా కరోనా దెబ్బతీసిందన్నారు. అందుకే బ్యాంకు రుణాలపై మూడు నెలల మారిటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌తెలిపారు. టర్మ్ ‌లోన్లపై మూడు నెలల పాటు ఇన్‌స్టాల్మెంట్స్ ఏ ‌తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెప్పింది.  రెపో రేటును 75 బేసిస్‌ ‌పాయింట్లు కట్‌ ‌చేస్తున్నట్లు శక్తికాంత్‌ ‌దాస్‌ ‌తెలిపారు. అన్ని బ్యాంకుల క్యాష్‌ ‌రిజర్వ్ ‌రేషియోలను కూడా తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌వెల్లడించారు.  వంద బేసిస్‌ ‌పాయింట్ల నుంచి నెట్‌ ‌డిమాండ్‌లో మూడు శాతానికి తగ్గించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నియమం ఏడాది పాటు వర్తించనున్నది. దీని ద్వారా బ్యాంకింగ్‌ ‌వ్యవస్థలోకి 3.74 లక్షల కోట్లు వస్తాయన్నారు.

rbi governorrepo rate by 75 basis pointssays cutting theShaktikanta Das
Comments (0)
Add Comment