చరణ్‌ ‌ప్లేస్‌లో రాణా?

కొరటాల మరియు చిరంజీవి కాంబినేషన్‌లో ఆచార్య మూవీ తెరకెక్కుతుండగా ఆ మూవీలో ఓ కీలక రోల్‌పై అనేక పుకార్లు తెరపైకి రావడం జరిగింది. అరంగట నిడివి గల ఓ కీలక రోల్‌ ‌కోసం మహేష్‌బాబుని తీసుకున్నారని, దానికోసం మహేష్‌కి 30 కోట్ల రూపాయలు ఆఫర్‌ ‌చేశారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు దర్శకుడు కొరటాల స్పష్టత ఇచ్చారు. ఐతే రామ్‌చరణ్‌ ‌నటిస్తున్న మాట వాస్తవం అని తేల్చడం జరిగింది.

కాగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ ‌షూటింగ్‌కి లాక్‌డౌన్‌ ‌కారణంగా వాయిదా పడడంతో ఆచార్య మూవీలో చరణ్‌ ‌నటించడం కష్టమే అంటున్నారు. దీనితో అనేక మంది నటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రెండు రోజుల క్రితం విజయ్‌ ‌దేవరకొండ పేరు వినిపించగా, తాజాగా రానా పేరు తెర పైకి వచ్చింది. అనేక భాషలలో సినిమాలు కమిటై ఉన్న రానా ఈ ప్రాజెక్ట్‌లో నటించగలడా అనే అనుమానం కలుగుతుంది.

koratala movieRana in CharanRana in Charan 'Place'
Comments (0)
Add Comment