స్టాక్‌ ‌మార్కెట్‌ ‌బిగ్‌ ‌బుల్‌, ‌ప్రముఖ వ్యాపారవేత్త… రాకేష్‌ ‌ఝున్‌ఝున్‌వాలా మృతి

దేశీయ స్టాక్‌ ‌మార్కెట్‌ ‌బిగ్‌బుల్‌ ‌రాకేష్‌ ‌ఝున్‌ఝున్‌ ‌వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ముంబయిలోని క్యాండీ బ్రీచ్‌ ‌హాస్పిటల్‌లో చేరారు. వారం రోజుల క్రితం హాస్పిటల్‌ ‌నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఝున్‌ ‌ఝన్‌ ‌వాలా మరో సారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కాండీ బ్రీచ్‌ ‌హాస్పిటల్‌కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. జూలై 5,1960లో హైదరాబాద్‌లో జన్మించిన రాకేష్‌ ‌ఝున్‌ఝున్‌ ‌వాలాకు చిన్న తనం నుంచే వ్యాపారం అంటే ఇష్టం కావడంతో కాలేజీ విద్యార్థిగా ఉండగా స్టాక్‌ ‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.

ఓ వైపు సీఏ చదువు కుంటూనే స్టాక్‌ ‌మార్కెట్‌లో మెళుకువలు నేర్చుకున్నారు. 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్‌ ‌మార్కెటర్‌గా వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన సెప్టెంబర్‌ 2018 ‌నాటికి రూ.11వేల కోట్ల ఆస్తులను సంపాయించారు. స్టాక్‌ ‌మార్కెటర్‌, ‌ఛార్టర్డ్ అకౌంటెంట్‌, ‌హంగామా మీడియా, ఆప్‌టెక్‌లకు ఛైర్మన్‌గా, అలాగే వైస్రాయ్‌ ‌హోటల్స్, ‌కాంకర్డ్ ‌బయోటెక్‌, ‌ప్రోవోగ్‌ ఇం‌డియా, జియోజిత్‌ ‌ఫైనాన్షియల్‌ ‌సర్వీసెస్‌లకు ఆయన  డైరెక్టర్‌గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఏవియేషన్‌ ‌రంగంలోకి అడుగుపెట్టిన ఝున్‌ ‌ఝున్‌ ‌వాలా ‘ఆకాశ ఎయిర్‌’‌ను ప్రారంభించారు.

Comments (0)
Add Comment