వంటింటి మహారాణి!

అదేమిటో

ఆవిడ ఉన్నంతసేపు

అక్కడివన్నీ వరుసగాను!

ఒద్దికగాను!

క్రమం తప్పకుండాను!

క్రమశిక్షణ మీరకుండాను!

 

నేను వెడితేనే!

తుళ్ళుతూ, తూలుతూ

పిలుపులకు, అరుపులుకు చిక్కకుండా కులుకుతాయి!

పట్టుల్లో, చేతుల్లో నిలవకుండా

జారతాయి!

అందుకే!……

ఆ సామ్రాజ్యానికి

ఆవిడనే జీవితకాలం

మహారాణిని చేసేసాను!

ముప్పొద్దులా సుకం మాత్రం

ముక్కుపిండి వసూలు చేస్తున్నా!

ఉషారం, 9553875577

Queen of the kitchen!
Comments (0)
Add Comment