నిమ్స్‌లో నాణ్యమయిన వైద్య సేవలు ..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌ప్రభుత్వం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆరోగ్య శ్రీని పెంచడం జరిగిందని, నిమ్స్ ‌హాస్పిటల్స్‌లో హార్ట్ అం‌డ్‌ ‌కిడ్నీ, లివర్‌ ‌ట్రాన్స్ ‌ప్లాంటేషన్‌ ‌సర్జరీలు ఎక్కువగా జరుగుతున్నాయి..లంగ్‌ ‌సర్జరీలు కూడా చేస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిమ్స్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. ప్రతి సంవత్సరం 200 కోట్లు గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి హామీ చేశారు. నిమ్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌కార్డియోథొరాసిక్‌ ‌సర్జరీ, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ‌జూబ్లీ హిల్స్, ‌మరియు సువెన్‌ ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌కలిసి నిమ్స్‌లో సంయుక్తంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక పీడియాట్రిక్‌ ‌హార్ట్ ‌సర్జరీ యూనిట్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.

ఇదే సమయంలో 200 ఐసియు బెడ్స్ ‌ప్రారంభించుకున్నామని అన్నారు. గురువారం నిమ్స్‌లో పీడియాట్రిక్‌ ‌హార్ట్ ‌సర్జరీ యూనిట్‌ను, 200 ఐసియు పడకలను  ప్రారంబించిన  అనంతరం హరీష్‌ ‌రావు మీడియాతో మాట్లాడుతూ…సువెన్‌ ‌ఫార్మాసుటికల్స్ ‌సీఎండీ వెంకట్‌ ‌జాస్తి, రోటరి క్లబ్‌ ఆఫ్‌ ‌జూబ్లిహిల్స్ అధ్యక్షులు పి సురేష్‌ ‌గుప్తా, సెక్రెటరీ కళ్యాణ్‌ ‌ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 4 కోట్లతో అనుకున్న సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసినందుకు అభినందనలు, కృతజ్ఞతలు. తెలిపారు. సకల సదుపాయాలతో కూడిన 6 పడకల అత్యాధునిక మాడ్యులర్‌ ‌కార్డియోథోరాసిక్‌ ఇం‌టెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్‌ అని, హార్ట్ ‌ట్రాన్స్‌ప్లాంట్‌ ‌సదుపాయానికి అనువైన క్లాస్‌-1 ఎయిర్‌ ‌కండీషన్డ్ ఐసోలేషన్‌ ‌క్లీన్‌ ‌రూమ్‌, ‌హార్ట్ ‌లంగ్‌ ‌మిషన్‌, ‌నైట్రిక్‌ ఆక్సైడ్‌ ‌సరఫరా యంత్రం, బ్రాంకోస్కోప్‌, ‌ఫొటోథెరపీ యూనిట్‌ ‌వంటివి ఇందులో ఉన్నాయని తెలిపారు. దీంతో పుట్టుకతో గుండె జబ్బులు ఉన్న పిల్లలకు, ఇతర పేద రోగులకు ఈ యూనిట్‌ ‌ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.

‘గత 6 నెలలుగా నమ్స్‌కు 186 కోట్ల రూపాలు ఏక్విప్మెంట్‌  ఇవ్వడం జరిగింది. ఐసియు 166 బెడ్స్ ఉం‌డగా ఇప్పుడు వాటి సంఖ్యని, మరో 200 అందుబాటులోకి వొచ్చాయి. త్వరలో మరో 74 అందుబాటులోకి రానున్నాయి. మొత్తం440 ఐసియు లో ఉంటాయి..గతంలో 68 ఉంటే ఇప్పుడు మరో 125 వెంటిలేటర్స్ ‌ని మంజూరు చేసుకున్నాం…ఇందులో  25 అడ్వాన్స్ ‌లైఫ్‌ ‌వెంటిలేటర్‌లు ఉన్నాయ్‌.. 5 ఎక్మో మెషిన్‌లు అందుబాటులోకి వొచ్చాయి…నిమ్స్ ‌లో మొత్తం 5 సిఆర్‌ఆర్‌టి మెషిన్‌లను ప్రారంభించుకున్నాం…50 కోట్లు రూపాయలతో 200 పడకల ఎమ్‌ ‌సి హెచ్‌  ‌బిల్డింగ్‌ ‌కి  త్వరలో అందుబాటులోకి తెస్తాము…ప్రస్తుతం నిమ్స్ ‌లో 1480 పడకలు ఉన్నాయి.

త్వరలో 2000 పడకలు బిల్డింగ్‌ని నిర్మించనున్నాం, పక్కనే ఉన్న ఎర్రమంజిల్‌ ‌కాలనీ వద్ద గల ఉన్న 32 ఎకరాల్లో నిర్మిస్తాం. త్వరలో పాలనాపరమైన అనుమతులు ఇవ్వనున్నాం..నిమ్స్ ‌హాస్పిటల్‌  ఎం‌తో మంచి పేరు ఉంది. పేరుకు తగ్గట్టే ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. అందుకే ఇక్కడికి పెద్ద సంఖ్యలో పేషెంట్లు వస్తుంటారు. వారందరికి అవసరమైన చికిత్స అన్ని వేళలా అందించేందుకు మా నిమ్స్ ‌వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి అంద్భుతమైన సేవలందిస్తున్నారు…కానీ మన ముఖ్యమంత్రి  పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఉన్న హాస్పిటల్స్  ఆధునీకరిస్తూ, మరో వైపు కొత్త హాస్పిటల్స్  ఏర్పాటు చేస్తున్నారు ..

హైదరాబాద్‌ ‌భవిష్యత్‌ అవసరాలు తీర్చేలా…హైదరాబాద్‌ ‌నగరం నలుదిక్కులా సూపర్‌ ‌స్పెషాల్టీ హస్పిటళ్ల ఏర్పాటు జరుగుతున్నది. గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, అల్వాల్‌, ఎ‌ర్రగడ్డలలో ఏర్పాటు చేస్తున్నది…నాలుగు హాస్పిటల్స్  ‌ల్లో సూపర్‌ ‌స్పెషలాటి సేవలతో పాటు, కోర్స్ ‌లు  ప్రారంభిస్తాము…నిమ్స్ ‌లో కొన్ని డిపార్ట్మెంట్స్ ‌కి కొత్త యూనిట్స్ ‌పెంచాలని నిర్ణయచడం జరిగింది..16 పీజీ సీట్లు పెంచడానికి ప్రతిపాదనలో ఎన్‌ ఎమ్‌ ‌సి కి ప్రతిపాదనలు పంపడం జరిగింది’ అని మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు.

Comments (0)
Add Comment