మార్పురావాలంటే..!

ఎదిరించేవారెవరు లేరిపుడు

అణిగిమణిగి వుండడమే నేటి ఆనవాయితి

ఊరించేమాటలు చాలు

ఉపవాసంతోనైనా కాలం గడిపేస్తం

తరాలెన్ని మారినా మారని తలరాతలు

తలలో ఆలోచనలలో మార్పురావాల్సింది

మనసుపెట్టి చూస్తేనేగదా ఆలోచన తలకెక్కేది

బలహీనతే బతుకనుకుంటే

నీలో మార్పెక్కడొస్తది

బలమేంటో కనుకుంటేనేగదా

బతుకుల మార్పొస్తది

సమాజాన్ని సైతం ఉతికారేసి మిలమిల మెరిసిలా చేసేది

తలుంది అందులో బుర్రుంది

కానీ

అది మత్తులో బరవెక్కి ముందుకెల్లనియ్యదు

మూడడుగులు ముందుకు

ఆరడగుల వెనక్కి నెట్టేసి

వెలుగును మాయంజేస్తది

అలతి అలతి బతుకుల్లో అలుముకున్న వెలతి తీరాలంటే

వెలేసిన వెలివాడల్లో అలుముకున్న అంధకారం

పదునెక్కిన ఆలోచనతో

చైతన్యమై విరియాలంతే

సి. శేఖర్(సియస్సార్), పాలమూరు, 9010480557.

prajatantra newstelangana updatestelugu kavithaluToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment