పీఆర్టీయూటిఎస్ సభ్యత నమోదు వారోత్సవాలు ప్రారంభం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 20 : పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శుల పిలుపుమేరకు సభ్యత నమోదు వారోత్సవాలను జిల్లా శాఖ అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం,మంచాల్ మండలంలో ముఖ్య కార్యకర్తలతో క్రియాశీలక సభ్యత్వం చేయించి ప్రారంభించడం జరిగింది.ఈసందర్భంగా.. జిల్లా అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ,317 ద్వారా రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని,స్థానికులు,స్థానికేతరులు కావడం జరిగిన అన్యాయాన్ని సరిచేసి జిల్లాకు న్యాయం చేయాలని మరియు ఉపాధ్యాయుల బిల్లులు జిపిఎఫ్,టిఎస్జిఎల్ ఐసి,సప్లమెంటరీ బిల్లులు,మెడికల్ బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేయకపోతే మరియు ట్రాన్స్ఫర్లు,ప్రమోషన్స్,పిఈటి, పండిట్ పోస్టులు,ఉన్నతికరణ,సిపిఎస్ రద్దు పీఆర్ సి వెంటనే అమలు పర్చాలని ఆయన డిమాండు చేశారు.ప్రభుత్వంపై తాడోపేడో తెలుసుకోవడానికి కూడా సంఘం సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.పోరాటానికి సిద్దంగా మనమందరం సంఘటితంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలపై వత్తిడి చేసి మన సమస్యలు సాధించుకోవడానికి సులభతరంగా ఉంటుందని ఉపాధ్యాయులకు ఆయన పిలుపునిచ్చారు. 2023 సంవత్సర సభ్యత్వం రెండు విధాలుగా ఉంటుందని సాధారణ సభ్యత్వం,క్రియాశీల సభ్యత్వమన్నారు. క్రియాశీల సభ్యత్వ రుసుం 5వందలని ఇందులో సాధారణ సభ్యత్వం మాదిరిగా 3 వందల రుపాయయలు,మిగతా 2 వందలు నేరుగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి క్రియాశీల సభ్యత్వం కలిగిన సభ్యుడు దురదృష్టవశాత్తు మరణిస్తే సంక్షేమ సంస్థ నుండి లక్ష రుపాయయలు చెల్లించబడతాయని ఆయన పేర్కొన్నారు.మండల,జిల్లా,రాష్ట్ర శాఖలలో వివిధ హోదాల్లోబాధ్యతలు నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వంతోపాటు సంక్షేమ సంస్థ సభ్యులుగా చేర్చుటకు జిల్లాకు 200 మంది సభ్యులను టార్గెట్గా నిర్ణయించడం జరిగిందన్నారు.సంక్షేమసంస్థలో సభ్యత్వం 5 వేల రూపాయయలు చెల్లించి సంస్థ నుండి బాండ్ను పొందాలన్నారు.సభ్యుడు ఉద్యోగ విరమణ పొందేలోపు మరణిస్తే నిధినుండి లక్ష రూపాయలు చెల్లిస్తారని, ఒకవేళ ఉద్యోగ విరమణ చెందితే సభ్యత్వం చేసిన నాటినుంచి ఉద్యోగ విరమణ వరకు ప్రతి సంవత్సరానికి వంద రూపాయయల చొప్పున కలిపి చెల్లిస్తారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు వరకాల పరమేష్, మంచాల మండల అధ్యక్షులు రాములు, మండల జిల్లా నాయకులు మల్లేష్ ,శ్రీకాంత్,జావేద్,వెంకటేష్,శేఖర్, చంద్రశేఖర్,ఆనంద్ కుమార్,హరి ప్రసాద్ పాల్గొన్నారు.

పీఆర్టీయూటిఎఎస్ సభ్యత నమోదు వారోత్సవాలు ప్రారంభం
Comments (0)
Add Comment