ఆశల పల్లకిలో మబ్బుతరకలపై ఊరేగించి

నిశీది వీధిలో ఒంటరిగా
వదిలి వెళ్ళినా
నీ రూపం నా కన్నుల్లో
మిణుగురై తళుకులీనుతోంది చెలీ…
మది గదిలో నీ
తలపుల మల్లెలన్ని వాడిపోయినా
పరుచుకున్న పరిమళం
తాజాగా గుభాళిస్తూనే ఉంది సఖీ…

వేణువంటి
నా జీవితాన
నువు పలికించిన
ప్రేమ సరాగం
నా చెవులలో
మారు మోగుతున్నది
ప్రియా..

జీవన వీణలో
ఒదిగిన తీగలం మనం
కలిసి పలికించిన సరిగమలెన్నొ

ఒంటరి తీగ
రాగం పలికేదెట్ల
సహచరీ… మళ్ళీ తోడురావా…
ఓ నిత్యనూతన
జీవన రాగాన్ని సృష్టిద్దాం.
– దిలీప్‌.‌వి, మల్లంపల్లి, ములుగు జిల్లా,
8464030808

prajatantra newsTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updates
Comments (0)
Add Comment