‌ప్రియ రాగాలు

ప్రియా…
నీ ప్రేమానుభూతి
నా మానసోద్యానంలో
నిత్య పూలరుతువై
నన్ను మురిపిస్తోంది

మమతల పరిమళాల్ని
పదే పదే
వెదజల్లుతూజి
నీ జ్ఞాపకం
నా హృదయాన్ని అల్లుకుంది

నువ్వు తొలకరివై
పలకరిస్తేజి
చిగుళ్ల సరాగాలతో
దరహసిస్తుంది
ఈ జీవిత వసంతం

రమణీయాకృతినిచ్చేజి
నీ ప్రేమ కోసం తపిస్తోంది
నా గుండె శిల
పున్నమి శిల్పి కోసం
తహతహలాడే అలలా

నీ కలల వర్షంలో
తడిసి ముద్దయ్యాయి
నా కళ్లు
మనసును ముంచేసింది
నీ వలపు జల్లు

ఈ బతుకు కలువ
అదేపనిగా
వెతుకుతోంది
చంద్రవంకా…
నీ ప్రేమకిరణ స్పర్శ కోసం
– డాక్టర్‌ ‌కొత్వాలు అమరేంద్ర
సెల్‌: 9177732414, ‌తిరుపతి (ఆ.ప్ర).

Comments (0)
Add Comment