‌ప్రధాని మోడీని సిక్కులు తరిమికొట్టారు

  • ఖలిస్తాన్‌ ‌స్వాతంత్య్రానికి ఇది నాంది
  • ఎస్‌ఎఫ్‌జే వ్యవస్థాపకుడు గుర్‌పత్వంత్‌ ‌సింగ్‌ ‌పన్ను

న్యూ దిల్లీ, జనవరి 6 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సిక్కులు పంజాబ్‌ ‌నుంచి తరిమికొట్టారని సిక్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు గుర్‌పత్వంత్‌ ‌సింగ్‌ ‌పన్ను హర్షం వ్యక్తం చేశారు. ఖలిస్థాన్‌ ‌స్వాతంత్య్రానికి ఇది నాంది అని తెలిపారు. రానున్న శాసన సభ ఎన్నికలు ఖలిస్థాన్‌ ‌రిఫరెండంపై తీర్పునిస్తాయన్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ ‌వద్ద రైతులు రోడ్లను దిగ్బంధించడంతో మోదీ పర్యటన రద్దయిన సంగతి తెలిసిందే. గుర్‌పత్వంత్‌ ‌సింగ్‌ ‌విడుదల చేసిన వీడియో సందేశంలో మోదీని అడ్డుకున్న రైతులను ప్రశంసించారు. సిక్కులు మోదీని పంజాబ్‌ ‌నుంచి తరిమికొట్టారన్నారు. ఇది ఖలిస్థాన్‌ ‌స్వాతంత్యాన్రికి నాంది అని తెలిపారు. రానున్న శాసన సభ ఎన్నికలు ఖలిస్థాన్‌ ‌రిఫరెండంపై తీర్పునిస్తాయని చెప్పారు. ఖలిస్థాన్‌ ‌రిఫరెండానికి ప్రచారం జనవరి 5 నుంచి ప్రారంభమైందని, దీనిని మోదీ ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ధరించినవారు ఢిల్లీకి వెనుదిరగవలసి వొచ్చిందన్నారు. రైతులు మోదీని చెప్పుల్లేకుండా పంజాబ్‌ ‌నుంచి తరిమికొట్టారన్నారు.

స్వాతంత్య్రం పొందాలని పంజాబ్‌ ‌నేడు నిర్ణయించుకుందని తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పంజాబ్‌కు ఆయుధాలతో వొచ్చారని, ఆమెకు సమాధానం ఆయుధాలతో లభించిందని చెప్పారు. మోదీ పంజాబ్‌లో అలజడి సృష్టిస్తున్నారు. అయితే మేం శాంతియుతంగా వోట్ల ద్వారా సమాధానం చెబుతాం, వోట్లతో ఖలిస్థాన్‌ ‌రిఫరెండాన్ని నిర్వహించడం ద్వారా సమాధానం చెబుతాం. శాసన సభ ఎన్నికలతోపాటు ఖలిస్థాన్‌ ‌రివరెండాన్ని నిర్వహించాలని పంజాబ్‌ ‌నిర్ణయించుకుంది. కాంగ్రెస్‌-‌ఛన్నీ, నవజోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధూ, బీజేపీ, ఏఏపీ, ఇలా ఏ పార్టీ అయినా  దీనికి వ్యతిరేకంగా ఉంటే, సిక్కుల ఆయుధం ఖండాను ఎదుర్కునక తప్పదని హెచ్చరించారు.

bjpCongresslatest newspm modiprajatantra newspaperpresent issuestelugu articlestrs party
Comments (0)
Add Comment