బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె వాయిదా

30,31 తేదీల్లో సమ్మె విరమణ ప్రకటన
న్యూ దిల్లీ, జనవరి 28 : వారానికి ఐదు రోజుల పనిదినాలు, వేతన పెంపు సవరణపై చర్చలు, ఉద్యోగ ఖాళీల భర్తీ, ఎన్‌ ‌పీఎస్‌ ‌రద్దు తదతర డిమాండ్లతో దేశంలోని బ్యాంకు యూనియన్లు ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 30, 31 తేదీల్లో సమ్మె నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే బ్యాంకు యూనియన్ల జేఏసీ యునైటెడ్‌ ‌ఫోరం ఆఫ్‌ ‌బ్యాంక్‌ ‌యూనియన్స్ (‌యూఎఫ్‌ ‌బీయూ) ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.

రెండ్రోజుల దేశవ్యాప్త సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు బ్యాంకు యూనియన్ల జేఏసీ తెలిపింది. యూఎఫ్‌ ‌బీయూ తాజా ప్రకటన నేపథ్యంలో, ఈ నెల 30, 31 తేదీల్లో బ్యాంకుల కార్యకలాపాలు మామూలుగానే కొనసాగనున్నాయి. బ్యాంకు యూనియన్ల డిమాండ్లపై చర్చించేందుకు ఇండియన్‌ ‌బ్యాంక్స్ అసోసియేషన్‌ (ఐబీఏ) ముందుకు రావడంతో యూఎఫ్‌ ‌బీయూ సమ్మె వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Comments (0)
Add Comment