పోరు పిడికిళ్ళు

కులం కత్తుల సాముచేసి
తల తెగిపడ్డ మొండాలతో
మనువుకు నైవేద్యం పెట్టండి

మతం మంటలు రాజేసి
దహించిన చితాభస్మంతో
విగ్రహాలను ఆరాధించండి

ఆధిపత్య విషం వెళ్లగక్కి
చచ్చిన పీనుగల ఎత్తుకుని
ఆలయ ప్రదక్షిణలు చేయండి

నిరంకుశ కొరడా జులిపి
చిందిన నెత్తుటి ధారలతో
పాప పంకిలం కడిగేసుకోండి

నల్లచట్టాల పలుగు వేటేసి
బతుకుల నిలువునా కూల్చి
సామ్రాజ్యాలను విస్తరించండి

అధికార బలం ప్రయోగించి
జాతి సిరిసంపదల కొల్లగొట్టి
దేశాన్ని అమ్మకానికి పెట్టండి

ఓట్లాటలో అడ్డదారిన
గెలిచిన ‘‘మోద్షా’’లు మీరు!
ఎదురన్నది లేనివారు కదా!!

అందుకే ఇంకా రెచ్చిపోండి
భారతావనిని తెగదున్నండి

కానీ ఏదో ఒకరోజు
బడుగు బలహీన గళాలు
విప్లవ శంఖం పూరిస్తాయ్‌

‌కార్మిక,కర్షక, శ్రామిక శక్తులు
కదం తొక్కి కవాతు చేస్తాయ్‌

‌సకలజనం పోరు పిడికిలెత్తి
కోట గోడలు బద్దలుగొడతాయ్‌
‌శంకరగిరిమాన్యాలు పట్టిస్తాయ్‌
– ‌కోడిగూటి తిరుపతి, 9573929493

poru pidikilluprajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment