నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

నిషేధిత గుట్కాలను తరలిస్తున్నట్లు చుంచుపల్లి సిఐ అశోక్‌ ‌కు  అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుదవారం ఉదయం 10 గంటలకు ఇల్లందు క్రాస్‌ ‌రోడ్డు వద్ద లక్ష్మీదేవిపల్లి ఎస్సై ప్రవీణ్‌ ‌వాహన తనిఖీలు చేస్తుండగా  టిఎస్‌28‌టిఏ 0131,04014778 అను నెంబర్లు గల  ట్రాలీ ఆటోలలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇట్టి గుట్కా ప్యాకెట్ల విలువ సుమారుగా 30,00,000/-రూపాయలు ఉంటుందని లక్ష్మీదేవిపల్లి పోలీస్‌ ‌స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సై ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌తెలియజేశారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు గుట్కా ప్యాకెట్ల రవాణాలో ఉన్నట్లు తెలిపారు.ఐదుగురిలో ఇద్దరు పరారీలు ఉన్నారు.

ముగ్గురు వ్యక్తులు పట్టుబడినట్లు ఎస్సై తెలిపారు. వీరి వద్దనుండి గుట్కా బ్యాగులతో పాటు రెండు ట్రాలీలను,ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు 1)ఉప్పల శ్రీనివాసరావు , భద్రాచలం 2)కంపసాటి రామకృష్ణ , న్యూ గొల్లగూడెం, కొత్తగూడెం, 3)రేకల శ్రీనివాస్‌ , ‌రామవరం ,కొత్తగూడెం పరారీలో ఉన్న వ్యక్తులు,1)బడే హేమ భద్రారావు ,భద్రాచలం.2) బాలకృష్ణ , చుంచుపల్లి, కొత్తగూడెం.పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను త్వరలోనే పట్టుకొని రిమాండ్‌ ‌నిమిత్తం కోర్టుకు హాజరు పరచడం జరుగుతుందని తెలియజేశారు. పట్టుబడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్ట్ ‌నకు తరలించడం జరుగుతుంది అని ఎస్‌ఐ ‌ప్రవీణ్‌ ‌తెలి .నిషేధిత గుట్కాల వలన ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌  ఆదేశాల ప్రకారం నిషేధిత గుట్కాలను రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Tags: police seized,banned guts,ci ashok,lakshmi devi palli

banned gutsci ashoklakshmi devi pallipolice seized
Comments (0)
Add Comment