వేణువు ఆలాపనే కాదు.. సుదర్శన ప్రయోగమూ తెలుసు

దేశానికి లడక్‌ ‌శిరస్సు వంటింది. 130 కోట్ల మంది భారత ప్రజలకు గర్వకారణం. దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసేందుకు సిద్ధపడే వారికే ఈ భూమి సొంతం. ఈ ప్రాంతాన్ని వేరుచేసేందుకు జరిపే ఎలాంటి ప్రయత్నాన్నైనా జాతీయభావాలు పుష్కలంగా ఉన్న లడక్‌ ‌ప్రజలు తిప్పికొడతారు’ … వేణువు ఆలపించే కృష్ణుడిని ఆరాధించే ప్రజలే, సుదర్శన చక్రం ప్రయోగించే కృష్ణుడి సిద్దాంతాన్ని కూడా అనుసరిస్తుంటారు మీరు చూపించిన ధైర్యసాహాసాలు.. ప్రపంచదేశాలకు భారతీయ శక్తిసామర్ధ్యాలను తెలియజేసింది..’.

  • రాజ్యకాంక్ష ఉంటే తోకముడవక తప్పదు
  • త్యాగాలు చేసేందుకు లడక్‌ ‌సిద్ధంగా ఉంది
  • చైనాకు గట్టి హెచ్చరిక చేస్తూ సైనికులను ఉత్తేజ పరిచిన ప్రధాని మోడీ

మాతృభూమి కోసం సైనికుల సాహసాలు, అంకిత భావం అసామాన్యమని ప్రధాని మోదీ కొనియాడారు. విస్తరణవాదానికి కాలం చెల్లించదని, ఇది అభివృద్ధి శకం అని పరోక్షంగా చైనాకు చురకలు వేశారు. లడక్‌లోని నీమూలో శుక్రవారం ఆకస్మిక పర్యటన జరిపిన ప్రధాని అక్కడి ఫార్వార్డ్ ‌పోస్ట్‌లో సైనికులను ఉద్దేశించి ఉత్తేజభరితమైన ప్రసంగం చేశారు. విస్తరణ వాద శకం ముగిసింది. ఇది అభివృద్ధి శకం. విస్తరణ శక్తులు మట్టికరవడమో, తోకముడవడమో జరిగినట్టు చరిత్ర చెబుతోందని ప్రధాని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే, తన ప్రసంగంలో చైనా పేరును ఎక్కడా నేరుగా మోదీ ప్రస్తావించలేదు. లడక్‌ ‌ప్రజలు తమ ప్రాంతాన్ని విడగొట్టేందుకు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు జరిపినా తిప్పికొడుతూ వచ్చారని ప్రధాని గుర్తుచేశారు. దేశానికి లడక్‌ ‌శిరస్సు వంటింది. 130 కోట్ల మంది భారత ప్రజలకు గర్వకారణం. దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసేందుకు సిద్ధపడే వారికే ఈ భూమి సొంతం. ఈ ప్రాంతాన్ని వేరుచేసేందుకు జరిపే ఎలాంటి ప్రయత్నాన్నైనా జాతీయభావాలు పుష్కలంగా ఉన్న లడక్‌ ‌ప్రజలు తిప్పికొడతారు’ అని మోదీ స్పష్టం చేశారు. వేణువు ఆలపించే కృష్ణుడిని ఆరాధించే ప్రజలే, సుదర్శన చక్రం ప్రయోగించే కృష్ణుడి సిద్దాంతాన్ని కూడా అనుసరిస్తుంటారని మోదీ గుర్తుచేశారు.

వి•రు చూపించిన ధైర్యసాహాసాలు.. ప్రపంచదేశాలకు భారతీయ శక్తిసామర్ధ్యాలను తెలియజేసిందని ప్రధాని మోదీ సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. లడఖ్‌లోని లేహ్‌ ‌వెళ్లిన ప్రధాని అక్కడ సైనికులకు ధైర్యాన్ని నూరిపోశారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ లేహ్‌కు ఆకస్మిక పర్యటన చేశారు. వి•లో ఉన్న ధైర్యం.. వి•రు పోస్టింగ్‌లో ఉన్న ప్రదేశం కన్నా ఎత్తైందని మోదీ సైనికులతో పేర్కొన్నారు. గాల్వన్‌ ‌లోయలో జరిగిన దాడిలో అమరులైన సైనికులకు నివాళి అర్పిస్తున్నట్లు మోదీ తెలిపారు. వి• త్యాగాలు, బలిదానాలు, పోరాటం వల్లే ఆత్మనిర్భర భారత్‌ ‌సంకల్పం నెరవేరుతుందని సైనికులను ఉద్దేశించి మోదీ తెలిపారు. 14కార్పస్ ‌దళాలు చూపిన తెగువను ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటా రన్నారు. మీరు ప్రదర్శించిన ధైర్యసాహాసాలు ప్రతి ఒకరి ఇంట్లో ప్రతిధ్వనిస్తున్నాయని ప్రధాని తెలిపారు. వి•లోని అగ్నిని, ఆవేశాన్ని.. భారతమాత శత్రువులు చూశారన్నారు. బలహీనంగా ఉన్నవారెప్పుడూ శాంతిని కాంక్షించరని, శాంతి కావాలంటే ధైర్యం చాలా ముఖ్యమైందని ప్రధాని అన్నారు. ప్రపంచ యుద్ధాల సమయంలోనైనా, శాంతి సమయంలోనైనా, అవసరం వచ్చినప్పుడు మన సైనికుల ధైర్యాన్ని ప్రపంచం చూసిందని, శాంతి కోసం కూడా మన సైనికులు పనిచేశారని మోదీ అన్నారు. ఉత్తమమైన మావన విలువల కోసం మనం పనిచేశామని ప్రధాని తెలిపారు. ఇక్కడ నేను మహిళా సైనికుల్ని చూస్తున్నానని, కదనరంగంలో ఇలాంటి సందర్భం ప్రేరణను కలిగిస్తుందని, వి• వైభవం గురించే నేను మాట్లాడుతున్నానని సైనికులను ఉద్దేశించి మోదీ అన్నారు. సైనిక మౌళికసదుపాయాలపై వ్యయాన్ని సరిహద్దుల్లో మూడు రెట్లు పెంచామన్నారు. లేహ్‌ ‌నుంచి.. లడఖ్‌, ‌సియాచిన్‌, ‌కార్గిల్‌, ‌గాల్వన్‌ ‌సెలయేళ్ల నుంచి .. ప్రతి పర్వతం, ప్రతి కొండ.. భారతీయ సైనికుల సత్తాను చూసిందన్నారు.

సరిహద్దుల్లో ప్రధాని ఆకస్మిక పర్యటన
ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉదయం లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేసారు. ప్రధాని షెడ్యూల్‌లో లేని ఈ పర్యటనకు ముందుగానే రహస్య ఏర్పాట్లు జరిగినట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో ప్రధానితో పాటు త్రివిధ దళాధిపతి బిపిన్‌ ‌రావత్‌ ‌కూడా ఉన్నారు. దేశం కోసం పోరాడుతున్న సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపడానికి ప్రధాని లడఖ్‌ ‌సరిహద్దులో పర్యటించారు. మోదీ పర్యటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ ‌వి•డియాలో ప్రత్యక్షం అయ్యాయి. వీడియోలో మోడీ కూడా సైనికుల దుస్తుల్లోనే ఉన్నారు. కొరోనా భయాన్ని విడిచి ఆయన సైనికులకు కరచాలనం చేయడం విశేషం. అంతే కాకుండా సైనికులకు సెల్యూట్‌ ‌చేసి, వారి భుజాలు తడుతూ అభినందించారు. భారత్‌, ‌చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోడీ అకస్మాత్తుగా సరిహద్దుల్లో పర్యటించటం గమనార్హం. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ అనూహ్యంగా లేహ్‌లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ ‌రావత్‌తో పాటు ఆర్మీ చీఫ్‌ ‌నరవాణెళిలను వెంటబెట్టుకుని ఆయన సరిహద్దుల్లో సైనికులను కలిశారు. లడఖ్‌లోని గాల్వన్‌ ‌లోయలో చైనా సైనికులతో జూన్‌ 15‌వ తేదీన జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన తరువాత ఉద్రిక్తతలు పెరిగాయి. చైనాతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో..ప్రధాని మోదీ అకస్మాత్తుగా లేహ్‌ ‌వెళ్లారు. అక్కడ ఆయన సైనికులతో మాట్లాడారు. ప్రస్తుతం లడఖ్‌ ‌సరిహద్దుల్లో టెన్షన్‌ ‌వాతావరణం నెలకొన్నది.

మోడీ పర్యటనతో ఆత్మస్థయిర్యం
అకస్మాత్తుగా ప్రధాని మోదీ శుక్రవారం లడఖ్‌లో పర్యటించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌స్పందించారు. కేంద్ర హోంమంత్రి షా ట్వీట్‌ ‌చేస్తూ.. మోదీ ముందుండి నడిపిస్తున్నారు. అత్యంత ధైర్యవంతులైన ఆర్మీ, వైమానిక దళం, ఐటీబీపీ సిబ్బందితో ప్రధాని మోదీ ఉన్నారు. ఈ పర్యటన కచ్చితంగా జవాన్ల ఆత్మ స్థైర్యాన్ని పెంచుతుందంటూ షా ట్వీట్‌ ‌చేశారు. ఇంతటి క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ లడఖ్‌లో పర్యటించడంతో జవాన్ల ఆత్మ స్థైర్యం కచ్చితంగా రెట్టింపవుతుంది. భారత జవాన్ల నీడలో దేశ సరిహద్దులు ఎప్పుడూ సురక్షితమే అంటూ రాజ్‌నాథ్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ప్రధాని మోదీ శుక్రవారం అకస్మాత్తుగా లద్దాఖ్‌లో పర్యటించారు. గాల్వాన్‌ ‌లోయలో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణాత్మక వైఖరి చోటు చేసుకున్న తరుణంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం చోటు చేసుకుంది. మోదీతో పాటు సీడీఎస్‌ ‌బిపిన్‌ ‌రావత్‌, ఆర్మీ చీఫ్‌ ‌నరవాణెళి కూడా ఉన్నారు.

స్వాగతించిన కాంగ్రెస్
‌ ‌లడఖ్‌లో ప్రధాని మోదీ పర్యటనపై స్పందించింది. లోకసభలో కాంగ్రెస్‌ ‌నేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి మాట్లాడుతూ… మోదీ పర్యటన కచ్చితంగా జవాన్లకు మంచి ప్రేరణను కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. ఉద్రిక్తత జరిగిన ప్రాంతాలను ఆయన ఇంతకు ముందే సందర్శించి ఉండాల్సిందని అన్నారు. దేశ భూభాగంలో చైనా చొరబాటుదారులు ఎక్కడ ఉన్నా వారిని వెంటనే తరిమి కొట్టాలని అధీర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Comments (0)
Add Comment