పరిమళమయం ఉమ్మడి కుటుంబం

ఉమ్మడి కుటుంబం
అంటేనే ఆనందాల నిలయం
కుటుంబపు మనుషుల
మధ్య కలుగు ప్రేమానురాగం
కష్టం, సుఖం,బాధ,
బాధ్యతగుర్తు చేసే బంధం
మమతానురాగం తోడైన
బంధం, బాంధవ్యం.

తల్లి తండ్రుల ప్రేమానురాగం
అన్నతమ్ముళ్ళ అనుబంధం
అక్క చెల్లెళ్ళ తోడు బంధం
అత్త కోడళ్ళ అనురాగం
నానమ్మ, తాతలతోటి పిల్లల
ప్రేమానుబంధం.

ఏ శుభ కార్యమైన అందరు ఆనందంగాచేయుసత్కార్యం
ఎంతటి ఆపద వచ్చిన ఒకరికి మరొక తోడును గుర్తు చేయు బంధం

ఉమ్మడి కుటుంబం అంటేనే
ప్రేమ ఆప్యాయతల మయం
బంధాలకు నిదర్శనం
అనుబంధాల తార్కాణం
విలువ పెంచి
పెంపొందించు గౌరవం..
సమాజానికి చూపించు ఆదర్శం…!
విరబూసిన పూల వనంలో
పరిమళం ల సౌరభం..!!
ఎన్‌.‌రాజేష్‌, (‌కవి,జర్నలిస్ట్)
‌హైదరాబాద్‌ 

Comments (0)
Add Comment