నాలుగేళ్లకే ఇంటికి పొమ్మంటే ఎలా

సైన్యంలో ఆత్మస్థయిర్యం దెబ్బతినదా
అగ్నిపథ్‌ ‌పథకాన్ని వెంటనే రద్దు చేయాలి
ఆర్మీ నియామకాలు వెంటనే చేపట్టాలి
చంచల్‌గూడ్‌ ‌జైలులో అరెస్టయిన వారితో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌ములాఖత్‌
‌వారికి న్యాయపరమైన సాయం అందిస్తామని హావి•
27 రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో పాల్గొంటామన్న రేవంత్‌
ఇం‌కెంతకాలం కెసిఆర్‌ ఆరచాకాలు సహిద్దాం : ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : అగ్నిపథ్‌ ‌పథకంతో సైన్యంలో నాలుగేళ్ల కాలానికే నియామకాలు చేయాలన్న మోడీ నిర్ణయం దేశభద్రతకే ముప్పు అని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. చంచల్‌ ‌గూడ జైల్లో సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌ ‌విధ్వంసం కేసులో నిందితులను ఆయన పరామర్శించారు. జైల్లో నిరసనకారులతో ములాకత్‌ అయిన రేవంత్‌.. ‌వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్‌ ‌రెడ్డితో పాటు అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌మల్లు రవి, అనిల్‌ ‌యాదవ్‌, ‌మల్‌ ‌రెడ్డి రంగారెడ్డి నిందితులను కలిశారు. సికింద్రాబాద్‌ ‌ఘటన, కేసులకు సంబంధించి న్యాయ సలహాలు ఇస్తామని నిందితులకు హావి• ఇచ్చారు రేవంత్‌. ‌న్యాయ సలహా కోసం ఇప్పటికే గాంధీభవన్‌లో టోల్‌ ‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. ఇక చంచల్‌ ‌గూడ జైలు బయట నిందితుల కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత ఎదురు చూస్తున్నారని చెప్పారు. అగ్నిపథ్‌పై ప్రధాని హడావిడి నిర్ణయం తీసుకున్నారని.. ఏకపక్ష నిర్ణయంతో యువకుల్లో అయోమయం నెలకొందని విమర్శించారు. కేవలం 4ఏళ్లు ఉద్యోగం చేసి రిటైర్మెంట్‌ అం‌టే ఎట్లా అన్న ఆయన..అగ్నిపథ్‌ 6 ‌నెలల ట్రైనింగ్‌లో ఏం నేర్పిస్తారని ప్రశ్నించారు. రిటైర్మెంట్‌ ‌తర్వాత ఎలాంటి భద్రత లేకుండా కుట్ర చేశారని ఆరోపించారు. మూడేళ్ల నుండి ఆర్మీలో నియామకాలు చేపట్టలేదని.. దీంతో సైనికుల కొరత ఏర్పడిందన్నారు. 2020లో ఫిజికల్‌ ఎగ్జామ్స్ ‌పాసైన వారికి రాత పరీక్షలు నిర్వహించాలని రేవంత్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. 22 ఏళ్లకే ఇంటికి పంపిస్తే ఆ జవాన్‌ ‌పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అయితే జైల్లో ఉన్న యువకులతో మాట్లాడ్డానికి కేవలం ఇద్దరికే అనుమతి ఇవ్వడంతో రేవంత్‌, ‌మల్లురవి యువకులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని హావి• ఇచ్చారు. యువకులవి న్యాయమైన డిమాండ్లేనని..వారి పోరాటానికి కాంగ్రెస్‌ ‌మద్దతుగా నిలుస్తుందని రేవంత్‌ ‌భరోసానిచ్చారు. వారికి న్యాయపరంగా అండగా ఉంటామని అన్నారు.

దేశాన్ని రక్షిస్తున్న సైనికులను గత ప్రభుత్వాలు కీలకంగా భావించాయని రేవంత్‌ ‌రెడ్డి ఉద్ఘాటించారు. దేశభక్తి కలిగిన వేల మంది యువకులను సైన్యంలోకి తీసుకున్నారని గుర్తుచేశారు. యువత గురించి కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. సమాజంలో ఏ వర్గంతోనూ చర్చించకుండా కీలకమైన నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సైనికులకు ప్రత్యేకమైన గౌరవం దక్కేలా ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. కేవలం నాలుగేళ్ల కోసం యువకులను సైన్యంలోకి తీసుకోవటం సరికాదన్నారు. నాలుగేళ్లు పనిచేయించుకుని ఇంటికి పంపిస్తే తర్వాత వారి సంగతేంటి? మోదీ సర్కారు జవాన్లలో గందరగోళం సృష్టించింది. 22 ఏళ్లకే ఇంటికి పంపిస్తే ఆ జవాన్‌ ‌పరిస్థితి ఏంటని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులు..ఇప్పటి వరకు 2 విడతల్లో 55 మంది యువకులను జ్యుడీషియల్‌ ‌రిమాండ్‌కు తరలించారు. వారిలో ఇప్పటి వరకు 46 మందికి ములాఖత్‌ ఇచ్చారు. ఇంకా మరో 9 మందికి మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌నాయకులకు ఈ 9 మందితోనే ములాఖత్‌ ‌కల్పించారు. సికింద్రాబాద్‌ ‌ఘటనకు సంబంధించిన కేసులో బాధితుల పక్షాన పోరాడాలని కాంగ్రెస్‌ ‌నిర్ణయించింది. కేసులు ఎదుర్కుంటున్న నిరసనకారుల తరఫున న్యాయపోరాటం చేయడానికి రెడీ అయింది. కేసులో ఉన్నవారంతా విద్యార్థులు అయినందున వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అవసరమైన వారికి న్యాయ సాయం అందించటం కోసం గాంధీభవన్‌లో 9919931993 టోల్‌‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. ఇకపోతే అగ్నిపథ్‌కు నిరసనగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ‌సత్యాగ్రహ దీక్షలు చేయనుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేయనున్నారు నేతలు. కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్‌ ‌కుటుంబాన్ని రేవంత్‌ ‌రెడ్డి పరామర్శించి నర్సంపేట నియోజకవర్గంలో జరిగే ఆందోళనలో పాల్గొననున్నారు.

ఇంకెంతకాలం కెసిఆర్‌ ఆరచాకాలు సహిద్దాం : ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌
‌సీఎం కేసీఆర్‌ అరాచాకాలను, అక్రమాలను ఇంకెంతకాలం సహిద్దామని అంటూ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. గిరిజనులకు పోడు భూములపై హక్కు కల్పించలేదని విమర్శించారు. వేల కోట్ల ప్రైవేట్‌ ‌దోపిడి, వందల కోట్ల పార్టీ ఆస్తులు ఉన్నా.. కేసీఆర్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ (టీఆర్‌ఎస్‌)‌కి 33 జిల్లాల్లో వందల కోట్ల విలువ చేసే ప్రజల భూమిని దోచి పెట్టారని రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌చేశారు. ఈ బరితెంగింపును ఇట్లానే వదిలేద్దామా అని ప్రశ్నించారు. బంజారాహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ‌రాష్ట్ర సీఎస్‌ ‌లకు హైకోర్టు గురువారం నోటీసులిచ్చింది. హైదరాబాద్‌ ‌బంజారాహిల్స్‌లో పార్టీ కార్యాలయానికి జరిగిన భూమి కేటాయింపుపై పిల్‌ ‌దాఖలైంది. కోట్లు విలువ చేసే భూమిని తక్కువ ధరకు కేటాయించారని పిటిషన్‌ ‌వేశారు. పిటిషనర్‌ ‌తరపున వాదనలు విన్న ప్రధాన ధర్మాసనం టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రెసిడెంట్‌, ‌జనరల్‌ ‌సెక్రటరీ, సీఎస్‌, ‌హైదరాబాద్‌ ‌కలెక్టర్‌ ‌కు నోటీసులు ఇచ్చారు. వీరితో పాటు రెవెన్యూ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీకి కూడా నోటీసులిచ్చారు. కోట్లు విలువ చేసే భూమిని కేటాయించారంటూ పిటీషనర్‌ ‌తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైదరాబాద్‌ ‌సహా 33 జిల్లాల్లో ఇదే విధంగా జరిగిందన్నారు పిటిషనర్‌. ‌దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని హై కోర్టు ఆదేశించింది.

PCC chief Revanth talks to those arrested in Chanchalgode jail
Comments (0)
Add Comment