యాదాద్రిలో  అంతరాలయంలో నిత్యపూజలకే పరిమితం

*భక్తుల దర్శనాలు నిలిపివేత
‌కొరోనా విజృంభిస్తున్న కారణంగా దేవాదాయ శాఖ ఆదేశాలతో యాదాద్రిలో మూడు రోజులు పాటు ఆలయంలో భక్తుల దర్శనాలను రద్దు చేయడంతో పూజలు అంతరాలయానికే పరిమితం అయ్యాయి. కేవలం పూజారులు నిత్యపూజలతో సరిపుచ్చారు. భక్తులకు అనుమతి నిరాకరించారు. గుట్ట కింద  వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా మూతపడ్డాయి. దీంతో యాదాద్రి పరిసరాలు బోసిపోయి కనిపించాయి. నిత్యం వేలాది భక్తజనంతో నిత్యకల్యాణం, పచ్చతోరణంలా కళకళ లాడే యాదాద్రి భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. స్వామివారి నిత్య కైంకర్యములు, ఆన్‌లైన్‌ ‌సేవలు, ఏకాంత సేవలను భక్తులు లేకుండా అర్చకులు యథావిధిగా నిర్వహిస్తు న్నారు. కొరోనా విజృంభిస్తున్న కారణంగా దేవాదాయ శాఖ ఆదేశాలతో బుధవారం నుంచి మూడు రోజులు పాటు ఆలయంలో భక్తుల దర్శనాలను రద్దు చేశారు. కొరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.  అలాగే ఆన్‌లైన్‌ ‌సేవలు, దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు. అలాగే పాతగుట్ట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోనూ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, యాదగిరిగుట్టలో కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయాలని ఇప్పటికే పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ‌గొంగిడి సునీతకు వినతి పత్రాలు అందజేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రజాప్రతినిధులు, స్థానికులు లాక్‌డౌన్‌ ‌విధించాలని కోరారని విప్‌ ‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రధానార్చకులతో పాటు మరో ఇద్దరు అర్చకులు, ఉద్యోగికి వైరస్‌ ‌సోకవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు దర్శనాలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
coronadevoteesno darshanyadadri temple
Comments (0)
Add Comment